త‌న తండ్రితో రోడ్డు మీద వెళ్లే వాహ‌నాలు లెక్క‌బెట్టించార‌న్న హై కోర్టు జ‌డ్జి..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో కొన్ని కామెంట్లు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా జ‌డ్జీలు ఏవైనా ప్ర‌త్యేక‌మైన కేసుల విచార‌ణ‌లో భాగంగా చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్య‌త బాగా పెరుగుతోంది.

ఇప్పుడు కూడా ఇలాంటిదే జ‌రిగిదంఇ.విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల‌ను ఎత్తి చూపుతో హై కోర్టు జ‌డ్జి చేసిన‌టువంటి వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

త‌న తండ్రి కూడా టీచ‌ర్ గా ప‌నిచేశార‌ని, కానీ టీచ‌ర్ల ప‌ట్ల ప్ర‌భుత్వాలు చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తించాయంటూ వ్యాఖ్యానించారు.విద్యా ప‌ర‌మైన‌టువంటి కేసులో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ మ‌ధ్య ప్ర‌భుత్వ స్కూళ్ల ఎదురుగా సచివాలయాల నిర్మాణాలు చేప‌డుతున్న నేప‌థ్యంలో ఆ స‌మ‌యంలో హైకోర్టు వాటిని లేకుండా చూడాలంటూ ఇచ్చిన ఆర్డ‌ర్ల‌ను ఆఫీస‌ర్లు ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో దాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచార‌ణ‌కు ఆదేశించిదంఇ.ఈ కేసు వాద‌న సంద‌ర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేప‌డుతున్న ఏక‌పక్ష విధానాల‌పై హై కోర్టు జ‌డ్జి అయిన‌టువంటి బట్టు దేవానంద్ ఇలాంటి కామెంట్లు చేశారు.

Advertisement
High Court Judge Battu Devanand Comments My Father Made To Count Vehicles On Roa

టీచ‌ర్ల‌తో ప్ర‌భుత్వం చదువు తప్ప అన్నింటికీ ఉప‌యోగించుకుంటోంద‌ని వాపోయారు.

High Court Judge Battu Devanand Comments My Father Made To Count Vehicles On Roa

ఆఖ‌ర‌కు బాత్రూమ్ లు కూడా కడిగిస్తున్నారంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.టీచ‌ర్ల‌తో చ‌దువు చెప్పించ‌డం మానేసి ఇలాంటి ప‌నులు చేయించ‌డం ఏంటంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.త‌న తండ్రిని కూడా గ‌తంలో రోడ్లపై వెళ్తున్న వాహనాలును లెక్క బెట్టేందుకు ఉప‌యోగించార‌ని, త‌న తండ్రిని కూడా ఇలాగే రోడ్ల మీద ఉంచారంటూ గుర్తు చేశారు.

ఇలా ప్ర‌భుత్వం టీచ‌ర్ల‌తో చేయించాల్సిన ప‌నులు తప్ప మిగ‌తావి చేయించ‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు.ఈ విష‌యంలో ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నులను ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.ఇలాంటి ప‌నులు ఇక‌నైనా మాని త‌మ ఆదేశాల‌ను పాటించాలంటూ ఆఫీస‌ర్ల‌కు ఆర్డ‌ర్ వేశారు జ‌స్టిస్ దేవానంద్‌.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే
Advertisement

తాజా వార్తలు