టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలు 2023లో పెద్దగా సినిమాలు రిలీజ్ చేయలేదు.
ఈ ఏడాది పుష్ప పార్ట్ 2, దేవర, గేమ్ చేంజర్, కల్కి 2898 AD వంటి సినిమాలు వస్తాయని భావించినా అవి వాయిదా పడ్డాయి.
ఈ సినిమాలు ఏడాది ముగిస్తున్నా ఇంకా విడుదల కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.యాక్షన్ థ్రిల్లర్ సలార్ ఒకటి ఈ ఏడాది రిలీజ్ కానుంది.
మరి ఈ సంవత్సరం థియేటర్‌కి రాకుండా తమ సినిమాలను పోస్ట్‌పోన్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం.
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న యాక్షన్ మూవీ "గుంటూరు కారం( Guntur Kaaram )" ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు.కానీ అది వాయిదా పడుతూ చివరికి 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కావడానికి సిద్ధమైంది.
ఆర్ఆర్ఆర్ ఫేమ్ రామ్‌చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని అందరూ అంచనా వేశారు.
కానీ దీని షూటింగ్ ఇంకా పూర్తవలేదు.డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2తో బిజీగా ఉండటమే దీనికి కారణం అని తెలుస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 డిసెంబర్‌లో విడుదల కావలసి ఉంది.కానీ ఎందుకో ఈ మూవీని వాయిదా వేశారు.ఇది 2024, ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్లు సమాచారం.
వరుస డిజాస్టర్‌లతో సతమతమవుతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున ( Nagarjuna )తన నెక్స్ట్ సినిమాలు బాగా ఆలోచించి ప్లాన్ చేసుకుంటున్నాడు.అందుకే ఈ ఏడాది తొందరపడి ఏ సినిమాని రిలీజ్ చేయలేదు.
దేవర సినిమాతో తారక అలరిస్తాడేమోనని ఫ్యాన్స్ ఆశగా చూశారు కానీ వారికి నిరాశే ఎదురయింది.మూవీ ఔట్‌పుట్ క్వాలిటీ బాగుండటం కోసం పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించి దర్శకుడు కొరటాల శివ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
అందుకే దీని విడుదల వాయిదా పడుతూ వస్తున్నట్లు టాక్.
వెంకటేష్, శైలేష్ కొలెన్ కాంబో మూవీ "సైంధవ్( Saindhav )" ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.డిసెంబర్ నెలలో దీనిని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు కానీ అదే నెల సలార్ రిలీజ్ అవుతుండటంతో సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy