తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో అందాల బ్యూటీ శ్రియ

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటి శ్రియా దర్శించుకుంది.

ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని, హుండీలో కానుకలు సమర్పించి శ్రియా మ్రొక్కుల చెల్లించుకుంది.

ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదా శీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి శ్రియా తో పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు