Bichagadu 2 : ఆ సమయంలో విజయ్ ఆంటోని చనిపోయారని అనుకున్నాం.. కావ్య షాకింగ్ కామెంట్స్!

విజయ్ ఆంటోని ( vijay antony )హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా అప్పట్లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

పార్ట్ వన్ మొత్తం అంతా కూడా మదర్ సెంటిమెంట్ తో నడిచింది.

అయితే బిచ్చగాడు 2 సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. బిచ్చగాడు 2( Bichagadu 2 ) సినిమా మొత్తం అంతా కూడా సిస్టర్ సెంటిమెంట్ తో నడుస్తుంది.

ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హీరో విజయ్ ఆంటోని.పార్ట్ 2 లో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు విజయ్ ఆంటోనీ.

ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టేశారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న విజయ్ ఆంటోనీ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెబుతున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో జరిగిన ప్రమాదం గురించి హీరోయిన్ చెప్పుకొచ్చింది. మలేషియా( Malaysia )లో లవ్ సాంగ్ షూటింగ్ కోసం సముద్రంలో జెట్ స్కి మీద విజయ్ ప్రాక్టీస్ చేసాక షాట్ అంతా ఓకే ఐపోయింది.

ఒక క్లోజప్ షాట్ కోసం మేము రెండు కొండల మధ్య నుంచి వచ్చి అలా బోట్ మీద వెళ్ళాలి.

ఆ సీన్ చేస్తున్నప్పుడు బోట్ ఫ్రంట్ పార్ట్ పైకి లేచింది ఆయన ఫేస్ కి ఢీకొట్టింది.దాంతో మేము నీళ్లలో పడిపోయాం.చాలాసేపటి తర్వాత మాకు తెలిసింది మేము నీళ్లలో పడిపోయామని.

ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నీళ్ళల్లో మునిగిపోతూ ఉండగా నాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చి ఉండడంతో ఆయన్ని బయటికి లాక్కుని వచ్చాను కానీ తర్వాత నా వల్ల కాలేదు వెంటనే క్రూ మెంబర్స్ కి చెప్పేసరికి ఆయన్ని బోట్ లోకి లాక్కొచ్చి సిపిఆర్ చేసాక హాస్పిటల్ లో అడ్మిట్ చేసాము.ఆయన ముక్కు దవడ మొత్తం డ్యామేజ్ ఐపోయాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అది చాలా మేజర్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆయన ఊపిరి తీసుకోకపోయేసరికి ఆయన చనిపోయారని అనుకున్నాము.కానీ అదృష్టం ఆయన ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టాక మాకు ఊపిరొచ్చింది అని చెప్పింది హీరోయిన్ కావ్య థాపర్( Kavya thapar ).

Advertisement

తాజా వార్తలు