ఆచార్యలో రామ్ చరణ్ కు జోడీ ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ ఆచార్య సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

దాదాపు 30 నిమిషాల పాటు చరణ్ పాత్ర ఉంటుందని.చిరంజీవికి శిష్యునిగా రామ్ చరణ్ నటించబోతున్నారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది జనవరిలో కొరటాల శివ రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన సీన్లను తెరకెక్కించనున్నారు.ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ కు కూడా హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే, కియారా అద్వానీ, తమన్నా, రష్మిక, ఇతర హీరోయిన్ల పేర్లు వినిపించాయి.అయితే చరణ్ పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కొత్త హీరోయిన్ ను తీసుకున్నారని సమాచారం.

Heroine Finalized For Ram Charan In Acharya Movie, Kajal Agarwal, Ram Charan, C
Advertisement
Heroine Finalized For Ram Charan In Acharya Movie, Kajal Agarwal, Ram Charan, C

చిరుత సినిమా మినహా మిగిలిన అన్ని సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో నటించిన రామ్ చరణ్ ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు.ఈ సినిమాలో చరణ్ కు జోడీగా నటించే హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండదని కేవలం రెండు మూడు సన్నివేశాలకు ఆ పాత్ర పరిమితమని తెలుస్తోంది.అందువల్లే కొరటాల శివ చరణ్ కు జోడీగా కొత్త హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారని సమాచారం.

ఆచార్య చిత్ర యూనిట్ కొత్త హీరోయిన్ పేరు, ఇతర వివరాలను వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.వచ్చే ఏడాది దసరా పండుగకు ఆచార్య సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా తరువాత కొరటాల శివ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు