Sudheer Dollysha: సుధీర్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్.. తిన్నా పడుకున్నా సుధీర్ గురించే అంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు సుధీర్.

కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా డాన్సర్ గా మెజీషియన్ గా, నటుడిగా ఇలా అన్ని రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.అయితే అంత బాగానే ఉంది కానీ సుధీర్ హీరోగా రావాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు.

సుధీర్ నటించిన రెండు మూడు సినిమాలు విడుదల అయ్యాయి కానీ థియేటర్ లో కనీసం నాలుగు ఐదు రోజులు కూడా ఆడలేదు.దీంతో అభిమానులు ఈ విషయంలో కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇది ఇలా ఉంటే సుడిగాలి సుధీర్ తాజాగా నటించిన చిత్రం కాలింగ్ సహస్ర.( Calling Sahasra ) ఇందులో శివ బాలాజీ, డోలిషా స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి కలయా నిజమా అనే పాటను విడుదల చేస్తూ ఒక ఈవెంట్ ని నిర్వహించారు.ఈ సందర్భంగా హీరోయిన్ డోలిషా( Dollysha ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నేను ఇన్‌స్టాగ్రామ్‌ లో షాపింగ్‌ పోస్ట్ పెడితే, సెలూన్‌కు వెళ్తే, నేను తింటే కూడా సుధీర్ గారి గురించి చెప్పండి అంటున్నారు.

నేను రెస్టారెంట్‌కు వెళ్లి తింటున్నప్పుడు సుధీర్ గారు ఎక్కడ ఉన్నారో నాకెలా తెలుస్తుంది.పోనీ ఆయనకు ఫోన్ చేస్తే పికప్ చేస్తలేరు.మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇస్తలేరు.

మరి మీ సుధీర్ ఏం చేస్తున్నారో నాకెలా తెలుస్తుంది.మదర్స్ డే రోజున మా మమ్మీ గురించి పోస్టు పెడితే.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

కాలింగ్ సహస్ర అప్‌డేట్ చెప్పాలని కామెంట్ చేస్తున్నారు.వాటన్నింటికీ ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నాను.

Advertisement

ఆ మెసేజ్‌లన్నింటికీ ఇదే రిప్లయ్.అలాగే ఇది కాలింగ్ సహస్ర అప్‌డేట్.

యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను చూడండి.నచ్చితే షేర్ చేయండి అని తెలిపింది డోలిషా.

సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెడితే, ఏదైనా స్టోరీ పెడితే సుధీర్ అన్న గురించి ఒక్క వర్డ్ అని అడుగుతున్నారు.నేను తనతో పనిచేశా కాబట్టి ఆయన గురించి నాకు బాగా తెలుసు.అందుకే ఒక్క వర్డ్ కాదు.

మూడు నాలుగు పేజీల ఎస్సే పెట్టినా తక్కువే.చెప్పాలంటే డౌన్ టు ఎర్త్, జెన్యూన్, స్వీట్ హార్ట్, ది మోస్ట్ హెల్పింగ్ పర్సన్.

ఇలా ఎస్సేనే ఉంది.మీరు చూడాలనుకుంటే ప్లీజ్ రండి.

ఎస్సే చూపిస్తా అని నవ్వుతూ తెలిపింది డోలిషా.కాగా ఈవెంట్ లో డోలిషా మాటలకు వెనకాలే ఉన్న సుధీర్ నవ్వుతూ తలదించుకున్నాడు.

తాజా వార్తలు