Sarath Kumar Devayani : దేవయాని ఇష్టపడ్డ ఆ స్టార్ హీరో తో పెళ్లి ఎవరి వల్ల ఆగిపోయింది ?

దేవయాని.ఈమెను చూస్తే చాల సాఫ్ట్ హీరోయిన్ లా కనిపిస్తుంది కానీ పక్క ముంబై హీరోయిన్ అనే విషయం చాల మందికి తెలియదు.

ఆమె తండ్రి కొంకణి అయినప్పటికీ ఆమె తల్లి మలయాళీ.కానీ పెరిగింది అంత కూడా ముంబై లోనే.

అక్కడే చదువులు కూడా పూర్తి చేసిన దేవయాని కి ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు.అందులో ఒకరు బాయ్స్ సినిమాలో హీరో గా నటించిన నకుల్.

ఆ తర్వాత తమిళ సినిమాలో కొన్ని సినిమాలు చేసాడు.తన కెరీర్ లో వందకు పైగా సినిమాల్లో నటించిన దేవయాని తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మరియు తెలుగు భాషల్లో పాపులర్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది.

Advertisement
Heroine Devayani Relation With Hero Sarath Kumar , Sarath Kumar , Devayani , Ta

మొదట బెంగాలీ సినిమాతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత మలయాళ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని తెలుగు మరియు తమిళ భాషలో బాగా పాపులర్ అయ్యింది దేవయాని.ఎన్నో సినిమాల్లో నటిస్తున్న కూడా దేవయాని వివాదాల్లో మాత్రం తక్కువగానే కనిపించింది.

సినిమాల్లో పీక్ గా ఉన్నా సమయంలో దర్శకుడు రాజ్ కుమారన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.సినిమాలు నిర్మించి ఆస్తులను కూడా కోల్పోయింది.

ఇద్దరు పిల్లలతో డబ్బులకు ఇబ్బంది కావడం తో తన పిల్లలు చదువుకునే స్కూల్ లో టీచర్ గా కూడా పని చేసింది.సీరియల్స్ లో నటించింది చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్లి ఫైనాన్సియల్ గా సేటిల్ అయ్యింది.

Heroine Devayani Relation With Hero Sarath Kumar , Sarath Kumar , Devayani , Ta

ఇక తమిళ్ లో ఎక్కువగా హీరో శరత్ కుమార్ తో సినిమాల్లో నటించి మంచి పెయిర్ గా గుర్తింపు దక్కించుకున్న దేవయాని శరత్ కుమార్ తో ప్రేమలో కూడా పడింది.వీరిద్దరూ కొన్నాళ్ల పాటు రహస్యంగా డేటింగ్ కూడా చేశారు.అయితే శరత్ కుమార్ ఇంట్లో ఎలాంటి సమస్య లేకపోయినా దేవయాని కుటుంబం మాత్రం వీరి పెళ్లి కి అంగీకరించలేదు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

దాంతో శరత్ కుమార్ తో బ్రేకప్ చెప్పి సినిమాల్లో బిజీ అయ్యింది.ఆ తరవాత కాలంలో కూడా రాజ్ కుమారన్ తో దేవయాని కుటుంబం పెళ్ళికి ఒప్పుకోలేదు.

Advertisement

కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతడిని పెళ్లి చేసుకుంది దేవయాని.ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతుంది.

తాజా వార్తలు