ఆ డైరెక్టర్ రెండు నెలలు తనతోనే ఉండాలన్నాడు.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు( Casting Couch ) సంబంధించి వార్తలు రావడం కొత్తేం కాదు.

అయితే టాలీవుడ్ డైరెక్టర్ల గురించి ఇలాంటి ఆరోపణలు రావడం ఒకింత తక్కువేననే సంగతి తెలిసిందే.

అయితే ఒక టాలీవుడ్ డైరెక్టర్( Tollywood Director ) వల్ల తాను ఇబ్బంది పడ్డానని మితా వశిష్ట్( Mita Vashisht ) అనే నటి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.ఒక దర్శకుడు హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని ఆమె అన్నారు.

ఒక తెలుగు డైరెక్టర్ తన సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారని మితా వశిష్ట్ పేర్కొన్నారు.ఆ సినిమాకు ముందు ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించిన హీరోయిన్ కు జాతీయ అవార్డ్ వచ్చిందని ఆమె అన్నారు.

అలాంటి టాలెంట్ ఉన్న దర్శకుడు నాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడంతో చాలా సంతోషించానని ఆమె పేర్కొన్నారు.కానీ ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదని మితా వశిష్ట్ వెల్లడించారు.

Advertisement

తనతో రెండు నెలలు కలిసి ఉండాలని ఆ దర్శకుడు షరతు విధించాడని ఆమె పేర్కొన్నారు.సినిమా గురించి ట్రావెల్ చేయాలని డైరెక్టర్ అడుగుతున్నాడేమో అని మొదట ఫీలయ్యానని మితా వశిష్ట్ వెల్లడించారు.మరోసారి డైరెక్టర్ తనతో ఉండాలని చెప్పడంతో ఆ డైరెక్టర్ ఉద్దేశం అర్థమైందని మితా వశిష్ట్ పేర్కొన్నారు.

అది కుదరదని ముఖం మీదే చెప్పానని ఆమె తెలిపారు.

ఆ డైరెక్టర్ గది నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడని మితా వశిష్ట్ వెల్లడించారు.ఆ డైరెక్టర్ నుంచి ఎలాగోలా తప్పించుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.మూవీ ఆఫర్ల కోసం తాను దిగజారలేనని చెప్పానని ఆమె పేర్కొన్నారు.

నా నిర్ణయాన్ని గౌరవించి కొందరు దర్శకులు ఆఫర్లు ఇచ్చారని మితా వశిష్ట్ తెలిపారు.మితా వశిష్ట్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?
Advertisement

తాజా వార్తలు