హీరో సుమంత్ తొలి పారితోషికం ఎంతో తెలుసా..?

ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ డైరెక్షన్ లో ప్రేమకథ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని హీరోలలో సుమంత్ ఒకరు.

నిన్న సుమంత్ హీరోగా నటించిన కపటధారి సినిమా విడుదలై మిక్స్ డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

కన్నడలో హిట్ అయిన ఈ సినిమా రీమేక్ లో పెద్దగా మార్పులు చేయకపోవడం సినిమాకు మైనస్ గా మారింది.మళ్లీరావా సినిమా తరువాత ఆ స్థాయి సక్సెస్ లేని సుమంత్ కెరీర్ కు కపటధారి కూడా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అయితే సుమంత్ మాత్రం కపటధారి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడూతూ సుమంత్ తన తొలి పారితోషికం గురించి చెప్పుకొచ్చారు.

అక్కినేని నాగార్జునే ప్రేమకథ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.ఆర్జీవీ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమకథ ఈ సినిమా కావడం గమనార్హం.

Advertisement
Hero Sumanth Interesting Comments About His First Remuneration, Hero Sumanth, Fi

అయితే సుమంత్ ప్రేమకథ సినిమా తొలి సినిమా కాబట్టి ఈ సినిమాకు తాను ఎలాంటి పారితోషికం తీసుకోలేదని వెల్లడించారు.సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పారితోషికం తీసుకుందామని అనుకున్నానని కానీ సినిమా ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు.

ఈ సినిమా తరువాత సుమంత్ యువకుడు సినిమాలో నటించగా ఈ సినిమాకు 5 లక్షల రూపాయలు పారితోషికం సుకున్నారని తెలుస్తోంది.

Hero Sumanth Interesting Comments About His First Remuneration, Hero Sumanth, Fi

ప్రస్తుతం సుమంత్ వాల్తేరు శీను అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా అయినా సుమంత్ కు హిట్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది.సుమంత్ కెరీర్ లో సత్యం, గోదావరి లాంటి డీసెంట్ హిట్లు ఉన్నా బ్లాక్ బస్టర్ స్థాయి హిట్లు లేకపోవడం గమనార్హం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు