Sriram : అన్నయ్య చనిపోయిన తర్వాత నరకం అనుభవిస్తున్నాను : హీరో శ్రీరామ్

హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన యాక్టర్ శ్రీ రామ్ "స్నేహితుడు" సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు.

ఆ మూవీతోనే తెలుగులో చాలా పాపులర్ అయ్యాడు.

అంతకుముందు "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" సినిమాలో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు.దడ, నిప్పు, లై, రావణాసుర వంటి సినిమాల్లో కూడా ఈ నటుడు యాక్ట్ చేసి మెప్పించాడు.

నిజానికి శ్రీరామ్ రక్తంలోనే నటన ఉంది.తన తండ్రి ఎప్పుడూ నాటకాలు వేసేవారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా డ్రామాలు చేసేవారు.కానీ సినిమా యాక్టర్ కాలేకపోయారు.

Advertisement

అందుకే శ్రీరామ్‌ను( Sriram ) ఈ రంగంలోకి దించారని అంటారు.

శ్రీరామ్‌కు సుధీర్ ( Sudheer )అనే ఒక అన్నయ్య కూడా ఉండేవాడు.కానీ ఆయన డెంగ్యూ ఫీవర్ వల్ల మరణించాడు.అమెరికా( America )లో 15 నుంచి 16 ఏళ్ల పాటు ఆయన నివసించాడు.

కానీ పుట్టాక హైదరాబాద్ లోనే పెరిగాడు.హైదరాబాద్‌కు రావాలని ఎప్పుడూ అనుకుంటుండేవాడు.

ఆ కల నెరవేరకుండానే అతను చనిపోయాడు.తన అన్నయ్యను కోల్పోయినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

తన అన్నయ్యకు గుర్తుగా ఒక కడియం కూడా తాను ఎప్పుడూ ధరిస్తానని చెప్పాడు.ఆ కడియం తన అన్నయ్య బతికున్నప్పుడు ధరిస్తూ ఉండేవాడని చెప్పాడు.

Advertisement

అన్నయ్యకు ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు అని చెప్పాడు.తనకు, తన అన్నయ్యకు మధ్య ఆరేళ్ల ఏజ్ గ్యాప్ ఉందని పేర్కొన్నాడు.

చిన్నతనంలో తన అన్నయ్యతో బాగా గొడవ పెట్టుకునే వాడినని, తనకు తన అన్నయ్యకి అస్సలు పడకపోయేదని అన్నాడు.

క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా తన అన్నయ్య, తాను ఎల్లప్పుడూ ఆపోజిట్ గా ఆడే వాళ్ళమని చెప్పుకొచ్చాడు.చాలా కొట్టుకునే వాళ్ళం అని కూడా తెలిపాడు.అయితే దగ్గరగా ఉన్నప్పుడు అలా పోట్లాడుకున్నా, దూరంగా వెళ్లిపోయినప్పుడు తన అన్నయ్య తన మీద అతి ప్రేమ చూపించేవాడని, అలాంటి అన్నయ్యను కోల్పోవడం ఎంతో బాధగా అనిపిస్తుందని శ్రీరామ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.శ్రీరామ్ పట్ల చాలామంది సానుభూతి చూపిస్తున్నారు.శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్.

అయితే తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ శ్రీకాంత్ పేరుతో సీనియర్ హీరో శ్రీకాంత్ ఉన్నాడు కాబట్టి అతను తన పేరును శ్రీరామ్ గా తెలుగులో వాడుతాడు.

తాజా వార్తలు