అతనే బిగ్ బాస్ విన్నర్ అంటున్న శ్రీకాంత్..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో విన్నర్ ఎవరవుతారని ప్రేక్షకుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు, ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు ఉండగా మోనాల్, అఖిల్ మినహా మిగిలిన నలుగురు కంటెస్టెంట్లలో ఎవరైనా బిగ్ బాస్ విన్నర్ కావచ్చని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అభిజిత్, సోహైల్, అరియానా, హారికలలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అవుతారో చూడాల్సి ఉంది.మరోవైపు బిగ్ బాస్ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు మరో 9 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పలువురు సెలబ్రిటీలు తమకు వ్యక్తిగతంగా ఇష్టమైన సెలబ్రిటీలకు మద్దతు ప్రకటిస్తున్నారు.

ఫ్యామిలీ సినిమాల్లో ఎక్కువగా నటించి గత కొన్నేళ్లుగా పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్న హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను ప్రతిరోజూ బిగ్ బాస్ షోను చూస్తానని తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోలను కూడా ఫాలో అవుతానని చెప్పారు.

Hero Srikanth Interesting Comments About Bigg Boss Winner,hero Srikanth Interest

క్రికెట్ ఎంత ఆసక్తిగా చూస్తానో బిగ్ బాస్ షోను కూడా తాను అంతే ఆసక్తిగా చూస్తానని బిగ్ బాస్ షోకు వెళ్లి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు ఉన్నారని చెడ్డపేరు తెచ్చుకున్న వాళ్లు ఉన్నారని.ఈ షోలో పాల్గొంటే మెంటల్ గా స్ట్రాంగ్ కావడంతో పాటు.లైఫ్ లో రెస్పాన్సిబిలిటీ పెరిగి మార్పు వస్తుందని శ్రీకాంత్ అన్నారు.

Advertisement
Hero Srikanth Interesting Comments About Bigg Boss Winner,hero Srikanth Interest

బిగ్ బాస్ షోలో ఎవరు విన్నర్ అవుతారో చెప్పలేమని తను మాత్రం అభిజిత్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నానని తెలిపారు.అరియానా, హారిక, సొహైల్ కూడా బిగ్ బాస్ టైటిల్ విన్ కావడానికి కష్టపడుతున్నారని తన అంచనాలను తాను చెబుతున్నానని అన్నారు.

బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ చాలా తెలివైనవాడని వెల్లడించారు.మరి శ్రీకాంత్ జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు