హీరో నిఖిల్ ఇంట విషాదం..!

యువ హీరో నిఖిల్ ఇంట్లో విషాదం నెలకొంది.నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.నిఖిల్ తండ్రి మరణ వార్త విన్న సినీ ప్రముఖులు నిఖిల్ కుటుంబానికి సంతాపం తెలియచేస్తున్నారు.

Hero Nikhil Siddharth Father Passed Away Details, Nikhil, Nikhil Dad, Nikhil Sid

పర్సనల్ గా.ప్రొఫెషనల్ గా నిఖిల్ కు తన తండ్రి శ్యాం సిద్ధార్థ్ ఎంతో సపోర్ట్ గా నిలిచారు.చైల్డ్ ఆర్టిస్ట్ నుండి నిఖిల్ ని సినిమాల్లో ప్రోత్సహించిన నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ తనయుడిని స్టార్ గా చూడాలని కలలు కన్నారు.

మొన్నామధ్య సోషల్ మీడియా ద్వారా తన తండ్రిని తన ఫ్యాన్స్ కి పరిచయం చేశాడు నిఖిల్.ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నారు.

Advertisement

 సూపర్ హిట్ మూవీ సీక్వల్ గా కార్తికేయ 2 వస్తుండగా.సుకుమార్ రాసిన ఓ క్రేజీ లవ్ స్టోరీతో కుమారి 21 ఎఫ్ డైరక్టర్ సూర్య ప్రతాప్ డైరక్షన్ లో 18 పేజెస్ సినిమా వస్తుంది.

ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు