Nikhil : ఆయనే కొడుకు రూపంలో మళ్లీ పుట్టాడు.. నిఖిల్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ( Young hero Nikhil )గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం నిఖిల్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఒకవైపు కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ కావాల్సినంత సమయాన్ని గడుపుతున్నారు.

ఇది ఇలా భార్యకు సీమంతం వేడుకను( Seemantam celebration ) నిర్వహించిన విషయం తెలిసిందే.తాజాగా నిఖిల్‌ తండ్రిగా ప్రమోషన్ పొందారు.

ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది.

Advertisement

ఈ విషయాన్ని నిఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్‌, డాక్టర్‌ పల్లవి ( Nikhil, Dr.Pallavi )2020 లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొడుకు( son ) పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనల్ అయ్యారు.

తన తండ్రి( father ) మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ చేశారు.ఈ సందర్బంగా హీరో నిఖిల్‌ తన ఇన్‌స్టాలో ఈ విధంగా రాసుకొచ్చారు.

ఏడాది క్రితమే మా నాన్న ను మిస్సయ్యాను.ఇప్పుడు మా కుటుంబంలోకి మగ బిడ్డ అడుగుపెట్టారు.

ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నాము.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.అని రాసుకు వచ్చారు నిఖిల్.అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ పోస్ట్ పై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

ఇకపోతే నిఖిల్ కెరిర్ విషయానికి వస్తే.ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ స్వయంభూ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్​ ఒక వారియర్​ పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి ఈ సినిమాతో నిఖిల్ ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారు చూడాలి మరి.

తాజా వార్తలు