మూడో సినిమాకు నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ ఎంతంటే?

సినిమా పరిశ్రమలో నటుడిని కావాలని చాలా మంది కలలు కంటారు.కాని కొంత మందికే అది సాధ్యపడుతుంది.

ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉన్నా అవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు.ఆ అవగింజంత అదృష్టం ఉంది కాబట్టే ప్రస్తుతం నటిస్తున్న కొత్త నటులకు మంచి అవకాశం లభిస్తోంది.

Naveen Polishetty Remuneration For Third Movie, Naveen Polishetty, Jathi Rathnal

అందులో ఒకరు నవీన్ పొలిశెట్టి.ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి థియేటర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను మొదలు పెట్టి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నవీన్ పొలిశెట్టి తాజాగా జాతిరత్నాలు సినిమాలో నటించాడు.

ఈ సినిమా ఓ చిన్న సినిమాగా విడుదలై రికార్డు కలెక్షన్స్ తో దూసుకపోతోంది.ఈ సినిమా ఎంతలా విజయం సాధించినదంటే ఆ సినిమా తో పాటుగా రిలీజ్ అయిన సినిమాలు నిరాశపరిచడంతో ఆ థియేటర్ లో కూడా జాతిరత్నాలు సినిమాను విడుదల చేసారంటే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

Advertisement

అయితే నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తను నెక్స్ట్ చేయబోయే సినిమాకు భారీగా రెమ్యునరేషన్ పెంచేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఓ నిర్మాత నవీన్ పొలిశెట్టికి 5కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు