మరో బాలీవుడ్ నటుడు ఇంట్లో నార్కోటిక్స్ సోదాలు!

డ్రగ్స్ మాఫియా బాలీవుడ్ ఇండస్ట్రీ ని కుదుపేస్తుంది.

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నార్కోటిక్స్ బృందం పూర్తిగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది.

ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత వెలుగు లోకి వచ్చిన ఈ డ్రగ్స్ మాఫియా తో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని అదుపులోకి తీసుకొని విచారించి పలువురి పేర్లు బయటపడడం తో వాటి ఆధారంగా దీపికా ప‌దుకొణే, సారా అలీఖాన్, శ్ర‌ద్ధా క‌పూర్, క‌రీష్మా ప్ర‌కాశ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తోపాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌ని కూడా విచారించారు.అంతేకాకుండా వివేక్ ఒబెరాయ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన ఈ నార్కోటిక్స్ అధికారులు తాజాగా బాలీవుడ్ నటుడు

అర్జున్ రాంపాల్

ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ కి డ్రగ్స్ కి లింక్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలకు వారు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.నిన్ననే బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

వారి ఇంటిపై జరిపిన సోదాల్లో 10 గ్రాముల మరిజువానా బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి సమీర్ మాట్లాడుతూ, నడియాడ్ వాలాకు సమన్లు జారీ చేశామని,

Hero Arjun Rampals House Searched By Ncb Susanth Singh Rajputh , Dipika Paduko
Advertisement
Hero Arjun Rampal's House Searched By NCB Susanth Singh Rajputh , Dipika Paduko

అయితే ఇంత వరకు అరెస్ట్ చేయలేదని చెప్పారు.ఇటీవల ఒక డ్రగ్స్ సరఫరా దారుడిని అధికారులు అరెస్ట్ చేసి విచారించగా,దీనికి కొనసాగింపుగా నడియాడ్ వాలా ఇంట్లో సోదాలు జరిపినట్లు తెలుస్తుంది.ఇక ఈ రోజు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదాలు జరిపారు.

ముంబైలోని అత‌ని ఇంటిని పూర్తిగా త‌నిఖీ చేసిన‌ట్టు తెలుస్తుంది.సోదాల‌లో ఏమైన డ్ర‌గ్స్ బ‌య‌ట ప‌డితే అత‌నిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు