టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్.
తాజాగా ఈయన ఓరి దేవుడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కుమార్తె ఐశ్వర్యను హీరోగా విశ్వక్ హీరోగా ఓ చిత్రాన్ని చేయాలని భావించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా విశ్వక్ కి11 వ ప్రాజెక్టుగా తెరకెక్కబోతోంది.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ చిత్రాన్ని అర్జున్ హోంబ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌పై తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు కూడా అర్జున్ కథ అందించడం విశేషం.ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించకపోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో విశ్వక్ నటించనని ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం.
ఇలా అగ్రిమెంట్ కుదిరిన తర్వాత విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అర్జున్ తనపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో నటించబోతున్న ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి గల కారణం ఏంటి? అసలు వీరిమధ్య ఎలాంటి గొడవ జరిగిందనే విషయాలు తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం విశ్వక్ మాత్రం ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy