‘దేశముదురు’ కాంబో

తెలుగు, తమిళంలో మంచి క్రేజ్‌ ఉన్న ముద్దుగుమ్మ హన్సిక.ఈ అమ్మడి మొదటి తెలుగు సినిమా ‘దేశముదురు’.

ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.ఆ సినిమా వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు హన్సిక వెనక్కు తిరిగి చూడకుండా దూకుడుగా దూసుకు పోతూనే ఉంది.

Allu Arjun To Romance With Hansika In Boyapati Srinu Movie-Allu Arjun To Romance

తెలుగులో స్టార్‌ హీరోల సరసన నటించిన హన్సిక అటు తమిళంలో కూడా ఈ అమ్మడు క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది.అయితే ఎంత మంది హీరోలతో చేసినా కూడా ఈమె బన్నీతో మొదటి సినిమా తర్వాత ఇప్పటి వరకు చేసింది.

లేదు.ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రాబోతుంది.

Advertisement

‘దేశముదురు’ చిత్రంలో ఆకట్టుకున్న అల్లు అర్జున్‌, హన్సికల జంట మళ్లీ రొమాన్స్‌ చేయబోతుంది.అల్లు అర్జున్‌ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా హన్సికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

తమిళంలో యమ బిజీగా ఉన్నప్పటికి తన మొదటి హీరో అవ్వడం వల్లే ఈ సినిమాలో నటించేందుకు హన్సిక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇన్నాళ్లకు రొమాన్స్‌ చేయబోతున్న ఈ జంట మరోసారి ఆకట్టుకుంటారో చూడాలి.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు