షాంపూలో వీటిని క‌లిపి వాడితే ఒత్తైన కురులు మీసొంతం అవుతాయి!

ఒత్తైన జుట్టు కావాల‌ని అంద‌రూ కోరుకుంటారు.

కానీ, కొంద‌రిలో ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, జుట్టు సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, ర‌సాయ‌నాల‌తో నిండి ఉండే ఉత్ప‌త్తుల‌ను వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ గ్రోత్ స‌రిగ్గా ఉండ‌దు.

ఫ‌లితంగా జుట్టు ప‌ల్చ‌బ‌డిపోయి స‌న్న‌గా మారిపోతుంటుంది.దాంతో జుట్టును ఒత్తుగా మార్చుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.

ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ ప్ర‌య‌త్నిస్తుంటారు.మీరూ ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ప‌దార్థాల‌ను మీ రెగ్యుల‌ర్ షాంపూలో క‌లిపి హెయిర్ వాష్ చేసుకుంటే ఒత్తైన కురులు మీసొంతం అవ్వ‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.ముందుగా ఐదారు ఆస్పిరిన్ మాత్ర‌ల‌ను తీసుకుని మెత్త‌గా పొడి చేసి పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత‌ ఒక ఉల్లిపాయను తీసుకొని తొక్క తొల‌గించి వాట‌ర్‌లో శుభ్రంగా క‌డ‌గాలి.

Advertisement

ఇలా క‌డిగిన ఉల్లిపాయ‌ను స‌న్న‌గా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ జ్యూస్‌, ఆస్పిరిన్ పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు క‌లుపుకోవాలి.చివ‌రిగా ఇందులో ఓ మూడు టేబుల్ స్పూన్ల మీ రెగ్యుల‌ర్ షాంపూను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి ఓ ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.నాలుగు రోజుల‌కు ఒక‌సారి ఇలా చేస్తే గ‌నుక ఉల్లిపాయ‌, ఆస్పిరిన్, ల‌వంగాల్లో ఉండే ప‌లు పోష‌కాలు హెయిర్ గ్రోత్‌ను ఇంప్రూవ్ చేసి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే పైన చెప్పిన విధంగా షాంపూ చేసుకుంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు