ఎగిరే చేపలు ఇవిగో... ఇలాగే అవి ఎంజాయ్ చేస్తాయి!

ఎగిరే చేపలు గురించి మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే వుంటారు.ఇవి నీటిలో ఎడడంతో పాటు అప్పుడప్పుడూ ఎగురుతూ ఆడుకుంటూ ఉంటాయి.

అంతేకాదండోయ్.రాత్రుళ్ళు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి కూడా.

నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్‌ స్పీడ్‌తో ఇవి పైకి దూసుకెళ్తున్నాయి.ఉష్ణమండల సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ‘ఫ్లయింగ్‌ ఫిష్‌’లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి.

ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయని చెబుతున్నారు.ఈ సముద్ర చేపల కుటుంబాన్ని "ఎక్సోకోటిడే" అని పిలుస్తారు.

Advertisement

లాటిన్‌ భాషలో ఎక్స్‌ అంటే ‘బయట’ అని ‘కొయిటోస్‌’ అంటే మంచం అని అంటారు.

ఇవి దాదాపు 200 మీటర్ల ఎత్తువరకు ఎగరగలవు.అయితే పక్షులు మాదిరిగా రెక్కలు పైకీ, కిందకి ఆడించినట్టు ఊపలేవు గాని నీటినుంచి పైకి వచ్చిన వేగాన్ని బట్టి వాటి రెక్కలను విచ్చుకుని మాత్రమే కొంత పరిధి మేర ఎగురుతాయి.వీటి కళ్లు నీటి అడుగున మాత్రమే కాకుండా గాలిలో కూడా స్పష్టంగా చూడగలిగేలా మార్పు చెందాయి.

ఇవి చిన్నచిన్న చేపలను, బూజుని, నాచుని తీని జీవిస్తాయి.ఉష్ణమండల, సమశీతోష్ణ సముద్ర జాతులకు చెందిన చేపలు.

అట్లాంటిక్, పసిఫిక్‌ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట

అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ఇవి బంగాళాఖాతంలో కూడా కనిపిస్తున్నాయి.భారత్, జపాన్, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా, చైనా, తైవాన్, వెనిజులా, బార్బడోస్‌ జలాల్లో ఎగిరే చేపలు ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా మాల్దీవులు, చెన్నయ్‌ తీరాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తున్నాయి.

Advertisement

వీటిని పట్టుకున్న వెంటనే వండుకొని తినేయ్యాలని చెబుతుంటారు కొంతమంది.ఇక లైట్ల సాయంతో వీటిని పట్టుకోవడం చాలా తేలిక.

ఒకవేళ మీరు ఈ ఎగిరే చేపలను ఎప్పుడు చూడకపోతే ఇక్కడున్న వీడియోని చూసి మీ కోరికను తీర్చుకోండి.