దంతాలు క‌దిలి నొప్పి పుడుతున్నాయా? అయితే ఈ చిట్కాలు మీకోస‌మే!

సాధార‌ణంగా ఒక్కోసారి దంతాలు క‌దిలి తీవ్ర‌మైన నొప్పి పుడుతుంటాయి.

దంత పరిశుభ్రత లేక‌పోవ‌డం, దంతక్షయం, ఇన్ఫెక్షన్, దంతాలు వదులుగా మారడం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య ఎదుర‌వుతుంది.

కార‌ణం ఏదైనా దంతాలు క‌దిలి నొప్పి పుడుతుంటే అస్స‌లు భ‌రించ‌లేక‌పోతుంటారు.చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డం కోసం పెయిన్ కిల్ల‌ర్స్ వాడుతుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ చిట్కాల‌ను ట్రై చేస్తే స‌హ‌జంగానే దంతాల నొప్పిని నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.నేరేడు చెట్టు ఆకులు దంతాల నొప్పికు చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

కొన్ని నేరేడు ఆకుల‌ను సేక‌రించి నీటిలో శుభ్రంగా క‌డిగి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ నేరేడు ఆకుల పేస్ట్ తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు దంతాల‌ను తోముకుని.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి గ‌నుక చేస్తే నొప్పి త‌గ్గ‌డ‌మే కాదు క‌దిలిన దంతాలు మ‌ళ్లీ గ‌ట్టిబ‌డ‌తాయి.

చిగుళ్ల వాపు, నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారు సైతం ఈ చిట్కాను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

అలాగే కొన్ని ల‌వంగాల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ల‌వంగాల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ వెల్లులి ర‌సం, చిటికెడు ఉప్పు, వ‌న్ టేబుల్ స్పూన్ మీ రెగ్యుల‌ర్‌ టూత్ పేస్ట్‌ మ‌రియు వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని యూస్ చేసి దంతాల‌ను తోముకుని వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఈ చిట్కాను పాటించినా క‌దిలిన దంతాలు గ‌ట్టిబ‌డి నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Advertisement

తాజా వార్తలు