బాలయ్య 100వ చిత్రంలో బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌

ఎన్నో అంచనాలున్న బాలకృష్ణ వందవ సినిమా అతి త్వరలోనే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలుగు కొత్త సంవత్సరం ఉగాది రోజున బాలయ్య వందవ చిత్రం షురూ అవ్వనుందనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య వందవ సినిమా అంటూ ఇప్పటికే ప్రకటన వచ్చింది.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటించబోతుండగా, మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమా మాలిని నటించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగి ప్రస్తుతం కూడా బాలీవుడ్‌లో స్టార్‌గా దూసుకు పోతున్న హేమా మాలినిని బాలయ్య చిత్రం కోసం టాలీవుడ్‌ తీసుకు రావాలని క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే బాలయ్య సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇక బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని నటిస్తే దుమ్ము లేచి పోవాల్సిందే.ఈ చిత్రంలో బాలయ్యకు ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

Advertisement

అందులో ఒక పాత్రకు గాను హేమామాలిని భార్యగా కనిపించనుంది.బాలకృష్ణకు జోడీగా హేమామాలిని ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండే సినీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హేమా మాలిని మరో బాలకృష్ణ పాత్రకు రాజమాతగా కనిపించనున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

Advertisement