ప్రతి రోజు టమోటాను ఆహారంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతి రోజు టమోటాను ఆహారంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది.ఇది గుండె వ్యాధులను తగ్గించటమే కాకుండా అనేక వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.

అటువంటి ఈ టమోటాను తప్పనిసరిగా ఆహారంలో బాగంగా చేసుకోవాలి.అయితే ఇప్పుడు టమోటాలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గుండె వ్యాధులను తగ్గిస్తుంది.టుఫ్ట్స్ మరియు బోస్టన్ విశ్వవిద్యాలయం మరియు బ్రిటీష్ జర్నల్ ఆఫ్న్యూట్రీషన్ పరిశోధకులు చేసిన పరిశోదనలో లైకోపీన్ ఎక్కువ మొత్తంలో తీసుకున్న వారిలో కార్డియోవాస్క్యులర్ వ్యాధి మరియు హృదయ ధమని వ్యాధి వచ్చే అవకాశాలు 30 శాతం తగ్గాయని తెలిపింది.

విటమిన్స్ మరియు ఖనిజాలు టమోటాలో విటమిన్ A, విటమిన్ B1, B3, B5, B6, B7, విటమిన్ C, విటమిన్ Kవంటి సహజ విటమిన్స్ మరియు ఫోలేట్, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, జింక్, మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి.సిగరెట్ పొగ నుండి రక్షిస్తుంది టమోటా సిగరెట్ పొగ నుండి వచ్చే ప్రభావాలను తగ్గిస్తుంది.టమోటాలో ఉండే ఫుమరిక్ ఆమ్లం మరియు చ్లోరోగేనిక్ ఆమ్లం సిగరెట్ పొగ ఉత్పత్తి చేసే కార్సినోజెన్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

Advertisement

జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం నిరోధిస్తుంది టమోటాను పాలకూర రసంతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, కాలేయం మరియు మలబద్ధకం నివారణకు సహాయపడుతుంది.జుట్టు ఆరోగ్యం ప్రతి రోజు టమోటా రసాన్ని త్రాగితే జుట్టు రూపాన్ని మరియు నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది.టమోటాలో విటమిన్ K సమృద్ధిగా ఉండుట వలన వెంట్రుకల కుచ్చులను బలోపేతం, పెరుగుదల, పునరుద్ధరణ మరియు మెరుపును పెంచడానికి సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యం టమోటాలో ఉండే సమ్మేళనాలు మోటిమల మీద పోరాడటానికి మరియు చర్మం కణాల నష్టాన్ని నిరోధించడానికి సహాయపడతాయి.ఒక అధ్యయనంలో ప్రతి రోజు రెండు కప్పుల టమోటా రసాన్ని త్రాగితే మొత్తం చర్మాన్ని మెరుగుపరుస్తుందని తెలిసింది.

Advertisement

తాజా వార్తలు