పచ్చి మామిడితోనూ ఆరోగ్యం భళా.. కానీ ఎవరు తినకూడదంటే?

స‌మ్మ‌ర్ అంటేనే మామిడి పండ్ల ( Mango fruit )సీజ‌న్‌.

వేస‌విలో క‌నివిందు చేసే మామిడి పండ్ల‌ను పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

ఈ సీజ‌న‌ల్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అయితే మామిడి పండ్లే కాదు మామిడి కాయ‌లు కూడా ఆరోగ్య‌క‌ర‌మే.

అవును, ప‌చ్చి మామిడికాయల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ప‌లు హెల్త్ బినిఫిట్స్ పొందొచ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.వేస‌వి కాలంలో స‌హ‌జంగానే శ‌రీరం నీటిని కోల్పోతుంది.

అయితే పచ్చి మామిడికాయ ( raw mango )తినడం ద్వారా శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది.త‌ద్వారా డీహైడ్రేష‌న్ బారిన ప‌డే రిస్క్ తగ్గుతుంది.

Advertisement
Health Benefits Of Eating Raw Mango! Raw Mango, Raw Mango Health Benefits, Healt

అలాగే ప‌చ్చి మామిడికాయ‌లో విటమిన్ సి( Vitamin C ) సమృద్ధిగా ఉంటుంది.ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

Health Benefits Of Eating Raw Mango Raw Mango, Raw Mango Health Benefits, Healt

ప‌చ్చి మామిడికాయ‌లోని ప‌లు ఎంజైములు లివర్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి.బైల్ ఉత్పత్తిని పెంచి లివర్‌ను డిటాక్సిఫై చేస్తాయి.పచ్చి మామిడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి.పచ్చి మామిడికాయలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.

ఇది హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి ర‌క్త‌హీన‌త‌ను దూరం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.ప‌చ్చి మామిడికాయ‌లోని ఫైబ‌ర్ కంటెంట్ మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది.

Health Benefits Of Eating Raw Mango Raw Mango, Raw Mango Health Benefits, Healt
విద్యార్ధులకు కెనడా శుభవార్త.. 40 వేల కొత్త అవకాశాలు సిద్ధం
స్త్రీల‌లో గుండె పోటు రావ‌డానికి ప్రధాన కార‌ణాలేంటో తెలుసా?

అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.గ్యాస్ట్రిక్, అసిడిటీ, అల్సర్ ఉన్నవారు మాత్రం ప‌చ్చి మామిడికాయ‌ల‌ను తిన‌కూడ‌దు.ఎందుకంటే, పచ్చి మామిడికాయలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉండ‌టం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల‌ను తీవ్ర‌త‌రం చేయ‌వ‌చ్చు.

Advertisement

ఆస్తమా మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ప‌చ్చి మామిడికాయ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.పచ్చి మామిడికాయలో సహజసిద్ధమైన చక్కెరలు తక్కువగా ఉన్నా, ఎక్కువగా తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

కాబ‌ట్టి, మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా పచ్చి మామిడికాయ‌ల‌ను తినే ముందు వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి.

తాజా వార్తలు