మీల్ మేకర్ ఎలా త‌యార‌వుతుంది.. అవి ఆరోగ్య‌క‌ర‌మా? కాదా?

మీల్ మేక‌ర్( Meal Maker ) చాలా మందికి మోస్ట్ ఫేవరెట్‌.మీల్ మేక‌ర్ తో క‌ర్రీస్‌, ఫ్రైస్ ఎక్కువ‌గా చేస్తారు.

బిర్యానీల్లో కూడా ఉప‌యోగిస్తుంటారు.మాంసాహారం తిన‌ని వారికి మీల్ మేక‌ర్ మంచి ప్రోటీన్ ఆల్టర్నేటివ్.

అయితే అస‌లు మీల్ మేకర్ ఎలా త‌యార‌వుతుంది.? అవి ఆరోగ్య‌క‌ర‌మా? కాదా? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.మీల్ మేకర్ ను సోయా చంక్స్( Soy Chunks ) అని కూడా పిలుస్తారు.

సోయా బీన్స్ నుంచి మీల్ మేక‌ర్ త‌యార‌వుతుంది.ఆరోగ్య‌ప‌రంగా మీల్ మేక‌ర్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

Advertisement

మీల్ మేకర్ లో ఉన్న ప్రోటీన్ చాల బలమైనది.నాన్-వెజ్ తినని వారు మీల్ మేక‌ర్ ను తీసుకుంటే ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

మీల్ మేక‌ర్ లో తక్కువ ఫ్యాట్, తక్కువ కేలరీలు.ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి.

అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ఇవి మంచి ఆహారం అవుతుంది.అలాగే ఐరన్ మరియు క్యాల్షియం ( Iron and calcium )మెండుగా నిండి ఉండ‌టం వ‌ల్ల మీల్ మేక‌ర్ రక్తహీనత నివారించడానికి, ఎముకల ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

డయాబెటిస్ ఉన్నవారికి మీల్ మేక‌ర్ సపోర్టివ్ ఫుడ్ అవుతుంది.ఎందుకంటే, హై ఫైబర్ కంటెంట్ క‌లిగి ఉండ‌టం వల్ల మీల్ మేక‌ర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ని ఒకేసారి కాకుండా మెల్లగా పెంచుతుంది.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

3223.మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డుతున్న‌వారు మీల్ మేక‌ర్ ను తీసుకుంటే ఆ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌తారు.అంతేకాకుండా సోయాలో ఉండే ఫైటోఎస్ట్రోజెన్స్ కొంత మందికి హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపరచడంలో సహాయపడతాయి, ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ సమయంలో మీల్ మేక‌ర్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Advertisement

మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచిదే, కానీ మితంగా తీసుకోవాలి.సహజమైన ఇతర ఆహారాలతో పాటు వాడుకుని తింటే ఇంకా మంచిది.అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

సోయా అల‌ర్జీ ఉన్న‌వారు కూడా మీల్ మేక‌ర్ జోలికి వెళ్ల‌కూడ‌దు.

తాజా వార్తలు