స‌మ్మ‌ర్ లో స‌పోటా పండ్లు తినే ముందు ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి!

స‌పోటా పండ్లు( Sapota fruits ).ఎంత రుచికంగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్ లో విరివిగా ల‌భ్య‌మ‌య్యే పండ్ల‌లో స‌పోటా కూడా ఒక‌టి.అయితే స‌మ్మ‌ర్ లో స‌పోటా పండ్లు తినే ముందు త‌ప్ప‌కుండా ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకోండి.

వేసవి కాలంలో సపోటా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా లాభదాయకమైన‌ది.సపోటా పండ్ల‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇవి వేసవిలో బాడీని హైడ్రేట్ గా ఉంచ‌డానికి డీహైడ్రేషన్ బారిన ప‌డ‌కుండా ర‌క్షించ‌డానికి తోడ్ప‌డ‌తాయి.

కూలింగ్ ప్రాపర్టీస్ ను క‌లిగి ఉండ‌టం వ‌ల్ల స‌పోటా పండ్లు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడ‌తాయి.సపోటా పండ్ల‌లో విటమిన్ ఎ, విటమిన్ సి( Vitamin A, Vitamin C ) వంటి పోషకాలు ఉంటాయి.

Advertisement
Health Benefits Of Eating Chikoo In Summer! Chikoo, Chikoo Health Benefits, Summ

ఇవి శరీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను( Immune system ) బ‌ల‌ప‌రిచి.ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.

స‌పోటా పండ్ల‌లో సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

వేసవిలో ఇబ్బంది పెట్టే అలసటను తగ్గించడంలో తోడ్ప‌డ‌తాయి.

Health Benefits Of Eating Chikoo In Summer Chikoo, Chikoo Health Benefits, Summ

స‌పోటా పండ్ల‌లో కాల్షియం( Calcium ) కంటెంట్ ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుతుంది.అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.అలాగే స‌పోటా పండ్ల‌లో స‌మృద్ధి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేసవి కాలంలో చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

అతి చేస్తే రిజల్ట్ ఇలాగె ఉంటది! రీల్స్ వైరటీగా చేద్దామని అనుకుంటే, చివరకు?
బూతు సినిమాలు మళ్లీ తెలుగు తెరను ఏలనున్నాయా?

అయితే ఆరోగ్య‌ప‌రంగా ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ స‌పోటా పండ్ల‌ను మితంగా తీసుకోవ‌డం చాలా ముఖ్యం.స‌పోటా విష‌యంలో ఎక్కువ శాతం మంది చేసే పొర‌పాటు ఏంటంటే రుచిగా ఉన్నాయ‌ని అతిగా తిన‌డం.

Health Benefits Of Eating Chikoo In Summer Chikoo, Chikoo Health Benefits, Summ
Advertisement

సపోటాలో సహజమైన చక్కెరలు అధికంగా ఉంటాయి.దీనివల్ల అతిగా ఈ పండ్ల‌ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.డయాబెటిస్ ఉన్న‌వారికి ఇది మ‌రింత ప్ర‌మాద‌క‌రం.

అలాగే స‌పోటా అధిక కేలరీలు కలిగిన పండు.అందువ‌ల్ల ఓవ‌ర్ గా తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు.

అతిగా స‌పోటా పండ్లు తిన‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.కాబ‌ట్టి, రోజుకు ఒక‌టి నుంచి రెండు స‌పోటా పండ్లు మాత్ర‌మే తీసుకోవాలి.

తాజా వార్తలు