వింట‌ర్‌లో కివి-స్ట్రాబెర్రీల జ్యూస్ ఖ‌చ్చితంగా తీసుకోవాలి..ఎందుకంటే?

కివి, స్ట్రాబెర్రీ.ఈ రెండు పండ్లూ రుచిగా ఉండ‌ట‌మే కాదు విడి విడిగా ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉంటాయి.

ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తాయి.అయితే ఈ రెండు పండ్ల‌నూ క‌లిపి జ్యూస్‌లా త‌యారు చేసుకుని ప్ర‌స్తుత వింట‌ర్ సీజ‌న్‌లో తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం కివి-స్ట్రాబెర్రీల జ్యూస్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు వింట‌ర్లో ఈ జ్యూస్‌ను సేవించ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా రెండు కివి పండ్ల‌ను తీసుకుని పీల్ తీసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే నాలుగు స్ట్రాబెర్రీ పండ్ల‌ను కూడా తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని అందులో కివి పండ్ల ముక్క‌లు, స్ట్రాబెర్రీ పండ్ల ముక్క‌లు, ఒక క‌ప్పు వాట‌ర్‌, రెండు స్పూన్ల లెమ‌న్ జ్యూస్‌, మూడు స్పూన్ల తేనె వేసుకుని బ్లెండ్ చేసుకుంటే.

Advertisement
Health Benefits Of Drinking Kiwi Strawberry Juice In Winter! Health, Benefits Of

కివి-స్ట్రాబెర్రీల జ్యూస్ సిద్ధ‌మైన‌ట్టే.వింట‌ర్‌లో వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ జ్యూస్‌ను సేవించ‌డం వ‌ల్ల.

అందులో ఉండే శ‌క్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ను ప‌టిష్టంగా మారుస్తాయి.దాంతో వివిధ ర‌కాల వైర‌స్‌లు, ఇన్ఫెక్షన్లు మ‌న శ‌రీరంపై దాడి చేయ‌కుండా ఉంటాయి.

అలాగే ఈ వింట‌ర్‌లో చాలా మంది త‌ర‌చూ కీళ్ళ నొప్పులు మ‌రియు కండ‌రాల నొప్పుల‌తో బాధ ప‌డుతుంటారు.

Health Benefits Of Drinking Kiwi Strawberry Juice In Winter Health, Benefits Of

అయితే కివి,స్ట్రాబెర్రీలతో త‌యారు చేసిన జ్యూస్ తీసుకుంటే ఆయా నొప్పులు దూరం అవుతాయి.శ‌రీరం యాక్టివ్‌గా త‌యారు అవుతుంది.నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అంతే కాదు, కివి-స్ట్రాబెర్రీల జ్యూస్‌ను త‌ర‌చూ తీసుకుంటే గుండె జ‌బ్బులు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది.కంటి చూపు పెరుగుతుంది.

Advertisement

హైబీపీ స‌మ‌స్య అదుపులోకి వ‌స్తుంది.మ‌రియు చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగ్గా మారుతుంది.

తాజా వార్తలు