ఉడతను కాపాడి, రోజూ దాని సంరక్షణ చూస్తున్నాడు.. ఎంత మంచి మనసో!

ప్రకృతి విపత్తుల సమయంలో జరిగే నష్టం అంతా ఇంతా కాదు.

ఇల్లు కూలిపోయి, ప్రాణ నష్టం సంభవించి, పంటలన్నీ నాశనమై, ఇలా ఎన్నో రకాల కోలుకోలేని నష్టాలు జరుగుతాయి.

ఆ సమయంలో బాధితుల కష్టాలు వర్ణనాతీతం.అయిన వారిని కోల్పోయి, తమకు నిలువ నీడ లేక రోదిస్తూ ఉంటారు.

ఇక ఆ సమయంలో మనుషుల బాధే దారుణంగా ఉంటే ఇక జంతువుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నోరు లేని మూగ జీవాలు, ఆకలితో, దాహంతో అలమటిస్తాయి.

వాటి బాధలను ఆ సమయంలో పట్టించుకునే నాథుడు కనపడడు.ఇదే పరిస్థితి ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో కనిపించింది.

Advertisement

అయితే ఓ వ్యక్తి ఉడతను సంరక్షించి, దానికి ఆహారమిచ్చి అది రోజూ ఎలా ఉందో గమనిస్తున్నాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

అమెరికాలో సుడిగాలులతో కూడిన హరికేన్‌లు తరచూ వస్తుంటాయి.అందువల్ల అక్కడి ఇళ్లను చెక్కతో నిర్మించుకుంటారు.

ఒక వేళ ఇల్లు కూలినా, ప్రాణ-ఆస్తి నష్టం తక్కువగా ఉంటుందని అలా చేస్తారు.ఇక ఇటీవల ఫ్లోరిడాలో ఓ భారీ హరికేన్ పెను విధ్వంసం సృష్టించింది.

ఇల్లు కూలిపోయి, చెట్లు పడిపోయి చాలా నష్టం జరిగింది.ఆ సమయంలో ఓ ఉడత అల్లాడిపోయింది.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట

తన సమీపంలోకి వచ్చిన ఓ వ్యక్తి జాకెట్‌లోకి అది దూరిపోయింది.ఆ తర్వాత దానిని ఆ వ్యక్తి పడేయలేదు.

Advertisement

ఇంటికి తీసుకెళ్లి, దానిని సంరక్షించాడు.ఆహారం పెట్టి, తిరిగి అది మామూలు స్థితికి చేరుకోవడానికి సాయం చేశాడు.

ఆ తర్వాత అది కోలుకున్న తర్వాత తిరిగి చెట్ల వద్ద దానిని వదిలి పెట్టాడు.మామూలు మనుషులు అయితే అంతటితో తమ పని అయిపోయిందని సరి పెట్టుకుంటారు.

అయితే ఆ వ్యక్తి ఆ ఉడతను వదిలేయలేదు.రోజూ వెళ్లి దానికి ఆహారం ఇస్తున్నాడు.

అది ఎలా ఉందోనని, దాని బాగోగులు చూసుకుంటున్నాడు.దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

అతడిది మంచి మనసు అని నెటిజన్లు కొనియాడుతున్నారు.