15 గంటల్లో 268 మెట్రో స్టేషన్లు తిరిగి వచ్చేసాడు... దెబ్బకు గిన్నిస్ రికార్డ్ వరించింది!

అవును, ఇక్కడ మీరు చదివింది అక్షర సత్యం.

ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న 268 మెట్రో స్టేషన్‌లను ఓ వ్యక్తి కేవలం 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో చుట్టి వచ్చేసాడు.

దాంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అతగాడిని వరించింది.అతడు ఈ అరుదైన రికార్డుని 2021 ఏప్రిల్ లోనే సాధించినా.

గిన్నిస్ సంస్థ మాత్రం ఇటీవల అతని ప్రయత్నాన్ని గుర్తించి.అతని పేరు మీద ఓ సర్టిఫికేట్‌ను జారీ చేయడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.ఢిల్లీకి చెందిన శశాంక్ మను( Shashank Manu ) అనే వ్యక్తి వృత్తి పరంగా పరిశోధనా విభాగంలో ఫ్రిలాన్సర్ గా పని చేస్తున్నాడు.

Advertisement

అతను 2021 ఏప్రిల్ 14న మెట్రో జర్నీని మొదలు పెట్టాడు.ఈ ఘనతను సాధించడానికి, ఫ్రీలాన్స్ పరిశోధకుడు ఒక రోజు టూరిస్ట్ కార్డ్‌ని కూడా వాడుకున్నాడు.

ఈ క్రమంలో అతగాడు మొదటగా బ్లూ లైన్‌లో ఉదయం 5 గంటలకు పయనం స్టార్ట్ చేసి గ్రీన్ లైన్‌లోని బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్‌లో రాత్రి 8:30 గంటలకు విజయవంతంగా ముగించాడు.టూరిస్ట్ కార్డ్ ఉండడంతో ఒక్క రోజులో అపరిమిత రైడ్‌లను ఉపయోగించుకోవడానికి అతగాడికి వీలుపడింది.అంతేకాకుండా అతను గిన్నిస్( Guinness record ) మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రయాణాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

ఆధారాల కోసం ప్రతి స్టేషన్ లో ఓ ఫొటో దిగి, అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సంతకాలను కూడా అతను తీసుకోవడం విశేషం.అతడికి గిన్నిస్ రికార్డ్ సాధించాలని బాగా కోరిక.

దాంతో ప్లాన్లో భాగంగానే ఈ ప్రయాణం చేసినట్టు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

అలా అతడు నానాయాతన పడి ఆఖరికి 15 గంటల 22 నిమిషాల 49 సెకన్లలో 268 మెట్రో స్టేషన్‌లను చుట్టేశాడు.తరువాత గిన్నిస్ రికార్డ్స్ బృందంతో చాలా నెలల చర్చల అనంతరం మనుకు ఎట్టకేలకు తన కష్టానికి ప్రతిఫలం దక్కింది.గిన్నిస్ రికార్డు సాధించిన మను.అనంతరం ట్విట్టర్లో తన ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్ ( Delhi metro stations )లను తక్కువ సమయంలోనే తిరిగి జర్నీని పూర్తి చేసుకున్నందుకు ఇప్పుడే గిన్నిస్ వారు నాకు సర్టిఫికేట్ జారీ చేశారు.

Advertisement

ధన్యవాదాలు అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.కాగా ఆ పోస్టుని చూసిన నెటిజన్లు ఆయన సాధించిన ఘనతకి చప్పట్లు కొడుతున్నారు.

తాజా వార్తలు