వయసు మూడేళ్లే కానీ ఎవరెస్ట్ కన్నా ఎత్తైన పర్వతం ఎక్కాడు.. ఆ విశేషాలు ఇవే..

సాధారణంగా పర్వతాలు ఎక్కాలంటే చాలా స్టామినా ఉండాలి.కొన్ని పర్వతాలపై వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి.

వాటిలో మనుగడ సాగించాలంటే చాలా సంకల్పం, శారీరక, మానసిక శక్తి ఉండాలి.అయితే తాజాగా మూడేళ్లకే ఒక బాలుడు అత్యంత ఎత్తైన పర్వతం ఎక్కి తన శక్తి సామర్థ్యాలు ఏంటో నిరూపిస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే, కర్ణాటకకు( Karnataka ) చెందిన 3.5 ఏళ్ల బాలుడు లడఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్‌ను( Umling La pass in Ladakh ) అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.ఉమ్లింగ్ లా పాస్ 19,024 అడుగుల ఎత్తులో ఉంది, అంటే ఇది మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తులో ఉంది.

జజీల్ రెహ్మాన్( Jazeel Rahman ) అనే బాలుడు ఈ ఘనత సాధించాడు.బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి ఉమ్లింగ్ లా పాస్‌కు వెళ్లాడు.

Advertisement

జజీల్ తల్లిదండ్రులు తౌహీద్ రెహ్మాన్, జష్మియాలకు( Towheed Rehman, Jashmiya ) ట్రావెలింగ్ పై మక్కువ ఎక్కువ.వారు ఇంతకుముందు కారులో భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆరుసార్లు లడఖ్‌కు వెళ్లారు.

ఈసారి వేరే మార్గంలో వెళ్లి బైక్‌పై లడఖ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఆగస్టు 15న కర్ణాటకలోని సులియా నుంచి ప్రయాణం ప్రారంభించి సెప్టెంబర్ 2న ఉమ్లింగ్ లా పాస్ చేరుకున్నారు.

ఉమ్లింగ్ లా పాస్ ప్రయాణం జజీల్‌కు సవాలుగా ఉంది.ఆ ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు సముద్ర మట్టం కంటే చాలా తక్కువగా ఉంటాయి.

ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి పడిపోతుంది.అయినా పట్టుదలతో జాజిల్ పెద్దగా ఇబ్బందులు లేకుండా ప్రయాణం పూర్తి చేశాడు.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. మందులతో అవసరం లేకుండా ఇలా చెక్ పెట్టండి!

జజీల్ సాధించిన ఘనత చెప్పుకోదగ్గది.యువకులందరికీ స్ఫూర్తిదాయకమని, మనసు పెడితే ఏదైనా సాధ్యమని అతడు సాధించిన ఈ ఫీట్ చెప్పకనే చెబుతోంది.

Advertisement

గతంలో 7 ఏళ్ల బాలిక పేరిట ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌ను అధిరోహించిన యంగెస్ట్ పర్సన్ రికార్డును కూడా ఈ మూడేళ్ల బాలుడు బద్దలు కొట్టాడు.

తాజా వార్తలు