ఇండస్ట్రీ లో ఉన్న లిరిక్స్ రైటర్స్ గురించి మన అందరికీ తెలుసు వాళ్ళు ఒక సినిమా లో రాసిన పాటల వల్లనే ఆ సినిమాకి చాలా హైప్ వస్తూ ఉంటుంది.
ఇక ఒకప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి సుందరామ్ముర్తి లాంటి వాళ్ళు చాలా మంచి సాంగ్స్ రాస్తూ జనాలని బాగా అలరించేవారు.
కానీ ఇప్పుడు వాళ్ళు లేకపోవడం తో కొత్త లిరిక్ రైటర్స్ ఇండస్ట్రీ లో సందడి చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాళ్లలో అనంత శ్రీరామ్( Ananta Sriram ) లాంటి రైటర్ చాలా మంచి సాంగ్స్ రాస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నారు.ఇక ఈయన తర్వాత ఈ మధ్య కాలం లో బాగా పాపులర్ అయిన లిరిక్ రైటర్ శ్యామ్ కాసర్ల( Kasarla shyam ).ప్రతి సినిమాలో ఈయన రాసిన ఒక పాట అయిన ఉంటుంది అంటే ఆయన టాలెంట్ ఏంటో మన అందరం అర్థం చేసుకోవాలి.ముఖ్యం గా తెలంగాణ స్లాంగ్ లో( Telangana slang ) వచ్చే పాటలకి అయితే ఇప్పుడు ఆయనే బెస్ట్ చాయిస్ గా మేకర్స్ కూడా అనుకొని ఆయన చేతనే సాంగ్స్ రాయిస్తున్నారు.
ఇక రీసెంట్ టైం లో వచ్చిన బలగం గానీ, దసర సినిమా గానీ ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన పాటలు రాశారు ఆయన రాసిన పాటలే ఈ సినిమాల్లో హైలెట్ గా నిలవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈయన పెద్ద సినిమాలకి సాంగ్స్ రాస్తూ చాలా బిజీ గా ఉంటున్నాడు.
ఈయన ఒక సాంగ్ కి దాదాపు గా మూడు లక్షల వరకు అమౌంట్ తీసుకుంటారు అనే టాక్ అయితే నడుస్తుంది.ఒక్కో టైం లో ఒక్కోకరి ట్రెండ్ నడుస్తోంది కాబట్టి అలాంటి టైం లోనే వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవాలి అని అందరూ చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే నడుస్తుంది.
ఇక ఈయన ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా చాలా పెద్ద హీరోలవే ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఈయన దాదాపు అరు నెలల వరకు ఖాళీ గా లేకుండా సాంగ్స్ బిజీ లో ఉన్నట్టు గా తెలుస్తుంది.నిజంగా ఒక తెలంగాణ బిడ్డ ఇంత పెద్ద ఇండస్ట్రీ లో ఒక మంచి లిరిసిస్ట్ గా పేరు తెచ్చుకోవడం చూస్తుంటే తెలంగాణ వాళ్ళందరికీ గర్వ కారణం గా ఉండటమే కాకుండా అయాన్ని చూసి చాలా మంది యువత ఇండస్ట్రీ కి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న టాలెంట్ ని నిరూపించుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy