అతను చేసిన ఆ పని కి ఆరోజంతా అన్నం తినలేదు..?

ప్రగతి తెలుగు సినిమాల్లో హీరోలకి హీరోయిన్స్ కి అమ్మ గా అత్తగా నటించి మంచి పేరు సంపాదించుకున్న నటి ఈమె పోషించే పాత్రలు రొటీన్ వే అయినప్పటికీ ఆమె ప్రతి క్యారెక్టర్ చేసేటపుడు ఆమె చూపించే వేరియేషన్స్ మాత్రం చాలా బాగా ఉంటుంది.

అయితే సినిమాల్లో కట్టు బొట్టు మంచి గా ధరించి ఒక పద్దతి గల ఫ్యామిలీ కుటుంభం లో ఉండే లేడీ అన్నట్టు కనిపించే ప్రగతి( pragathi ).

సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ల రేంజ్లో చలామణి అవుతుంది.లాక్ డౌన్ టైం నుండి ప్రగతి తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టింది.

సినిమాల్లో జస్ట్ అలా మూలాన నిలబడే పాత్రల్లోనో లేక ఏడుస్తూ కనిపించే పాత్రల్లోనే నటించేది ప్రగతి.అలాంటి ఆమె బుల్లేట్ బండి తోలడం, జిమ్ లో వర్కౌట్లు చేసే ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, మాస్ పాటలకి డాన్సులు ఇరగదీయడం ఇలాంటివి చాలా చేసి.

అందరికీ కొత్త ప్రగతిని పరిచయం చేసింది.ఆ తర్వాత ఈమె చాలా ఇంటర్వ్యూల్లో దర్శనమిచ్చింది.అన్ని ఇంటర్వ్యూలలోనూ కెరీర్ ప్రారంభంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలను చేదు అనుభవాలను చెప్పుకొస్తుంటుంది ఈ బ్యూటీ.

Advertisement

గతంలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch )వేధింపులకు గురయ్యాను అంటూ ప్రగతి చేసిన కామెంట్స్ ఎవ్వరూ మర్చిపోలేరు.అందులోనూ ఓ స్టార్ కమెడీయన్ ‘తనతో చాలా బాగా ఉంటూనే .తనతో ఓ రోజు మిస్ బిహేవ్‌ చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.

అతని పేరు మాత్రం బయటపెట్టలేదు.అది తన జీవితంలో ఓ చేదు అనుభవం అంటూ ఆమె చెప్పుకొచ్చింది.అది ఇప్పటికీ తన మైండ్లో నుండి పోవట్లేదు అని ప్రతిసారి చెబుతూనే ఉంది.

ఆ రోజు తనకు ఎలాంటి పని చేయాలనిపించలేదట, ఆ రోజు భోజనం, టీ వంటివి కూడా మానేసాను అని చెబుతూనే ఉంది.కానీ ఆ స్టార్ కమెడియన్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈమె బయటపెట్టడం లేదు ప్రస్తుతం ఈమె తెలుగు లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే చెప్పాలి ఈమె తెలుగు లో ఉన్న అందరి హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు