రోష్ని నాడార్.( Roshni Nadar ) ప్రస్తుతం ఈ మహిళ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది.
అందుకు కారణం ఆమె రూ.85 వేల కోట్ల వైట్ మనీ గల అత్యంత ధనవంతురాలుగా( Richest Woman ) అవతరించింది.కొటక్-హురున్ విడుదల చేసిన లెక్కల ప్రకారం రోష్ని ఇండియాలోనే టాప్ రిచెస్ట్ ఉమెన్ గా నిలుస్తోంది.
ఈ సంపదను ఈజీగా ఏమీ ఆమె పొందలేదు.రాజకీయ వారసుల వలె ఆమె ఒక డమ్మీ క్యారెక్టర్ అసలే కాదు.
ఆమె ఇండియన్ ఐటీ దిగ్గజం శివ నాడార్( Shiv Nadar ) కుమార్తె.అయినను సొంతంగా తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకుంది.
తమిళనాడులోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన శివ నాడార్ (77) నాలుగు దశాబ్దాల క్రితం హెచ్‌సీఎల్ కంపెనీ( HCL Company ) ప్రారంభించే దానిని అతిపెద్ద కంపెనీగా తీర్చిదిద్దాడు.ఐటీ, హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్‌కు, ఇంపోర్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ కంపెనీ ఆయనకు పద్మభూషణ్ పురస్కారం( Padma Bhusan Awardee ) కూడా సాధించి పెట్టింది.
శివనాడారుకు రోష్ని ఒక్కతే కూతురు.వారసుడు పుట్టలేదని అతను బాధపడలేదు.
రూ.వేల కోట్ల మార్కెట్ వ్యాల్యూ ఉన్న హెచ్‌సీఎల్ కంపెనీ పగ్గాలు చేపట్టడానికి అర్హురాలిగా ఆమెను తయారు చేశాడు.సడన్‌గా ఆమెను తీసుకొచ్చి కంపెనీలో కూర్చోబెట్టలేదు.
ఆమె ఇష్టాలతో అడ్డుపడకుండా, తన ఆశలకు తగినట్టుగా మార్చుకున్నాడు.వేలాది కోట్ల రూపాయలు చూసి ఆ మోజులో ఆమె పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు.ఆమె శాస్త్రీయ సంగీతంపై మక్కువ ఉండి అది నేర్చుకుంటానంటే అతను సంతోషంగా మ్యూజిక్ క్లాసులలో చేర్పించాడు.
ఆమె కోరిక మేరకే అమెరికాలో( America ) కమ్యూనికేషన్స్ చదివించాడు.సీఎన్బీసీ, సీఎన్ఎన్ వంటివి నేషనల్ మీడియా సంస్థలలో ఆమె కొద్ది రోజులు పని చేసింది.అక్కడ ఆమె రాణించలేకపోయింది.
దాంతో శివనాడార్ బిజినెస్ మేనేజ్‌మెంటులో( Business Management ) ఆమెను జాయిన్ చేశాడు.స్వదేశానికి తిరిగి వచ్చాక కంపెనీకి ఆమెను సీఈవోగా అనౌన్స్ చేశాడు.
అలాగని మొత్తం కంపెనీ బాధ్యతలు ఆమెకు అప్పగించలేదు.
కంపెనీ ట్రస్టు తరఫున నడిచే స్కూళ్లు, ఇతర సోషల్ రెస్పాన్సిబులిటీ సంస్థలను మేనేజ్ చేయమని చెప్పాడు తద్వారా ఆమెకు సమాజం పట్ల ఒక అవగాహన వచ్చేలా చేశాడు.26 ఏళ్లకే ఆమె మార్కెట్లో లిస్ట్ అయిన ఒక కంపెనీకి సీఈవో కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.తర్వాత కంపెనీకి డైరెక్టర్ చేశాడు.
బిడ్డ లవ్ చేసిందని తెలిసి ఆమెకు నచ్చిన శిఖర్ మల్హోత్రా అనే మామూలు హోండా డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు.రీసెంట్ గానే కంపెనీ ఛైర్ పర్సన్‌ను ఆమెను నియమించాడు.
హెచ్‌సీఎల్ బాధ్యతలు అన్ని ఆమెకే ఇచ్చినట్లు బయటికి కనిపిస్తున్న వెనుక ఉండి తన తండ్రి ఆమెను ముందుకు నడిపిస్తున్నాడు.ఆ విధంగా కూతురిని ఎల్లవేళలా గైడ్ చేస్తూ నిజమైన తండ్రిగా శివ నాడార్ నిలుస్తున్నాడు.
కంపెనీకి కంపెనీ ఉద్యోగులకు ఎలాంటి రిస్క్ లేకుండా జాగ్రత్త పడుతున్నాడు.తండ్రి చెప్పినట్లు వింటూ రోష్ని కూడా మంచి పొజిషన్‌కు వెళ్ళింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy