హైదరాబాద్ అబిడ్స్‎లో హవాలా నగదు పట్టివేత

హైదరాబాద్ లో హవాలా నగదు మరోసారి భారీగా పట్టుబడింది.అబిడ్స్ లో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎటువంటి రశీదు పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.63.50 లక్షల నగదును సీజ్ చేశారు.అనంతరం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నగదు తరలింపు విషయంపై వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్, నల్గొండ పరిధిలో హవాలా నగదు, అక్రమంగా తరలిస్తున్న నగదు ఇటీవల భారీగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023