స్టైలిష్ ఎలక్ట్రిక్ రిక్షా చూశారా.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..

ఎగిరే కార్లలో చక్కర్లు కొట్టాలని చాలా మంది కలలు కన్నారు కానీ ఇప్పటికీ ఆ కల నెరవేరలేదు.

ఆ కలలను సాకారం చేసేందుకు పలు కంపెనీలు ఫ్లయింగ్ కార్లను టెస్ట్ చేస్తున్నాయి.

ఈ టెస్టులు కూడా విజయవంతం అవుతున్నాయి.దాంతో ఆ కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంతలో మార్కెట్లోకి చాలా మోడర్న్, అడ్వాన్స్‌డ్‌ కార్లు ఎంట్రీ ఇస్తూ ఆకట్టుకుంటున్నాయి.భారతదేశంలో కూడా వాహనాలు చాలా మోడ్రన్ గా మారుతూ ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ముంబైలో( Mumbai ) ఓ కొత్త తరహా మూడు చక్రాల వాహనం ప్రజలను ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

వర్లీ ( Worli )ప్రాంతంలోని బిజీగా ఉండే వీధిలో ఈ మూడు చక్రాల వాహనాన్ని ఒకరు వీడియో రికార్డ్ చేశారు.ఆ వీడియోలో ఈ త్రీ వీలర్ రిక్షా రెడ్ లైట్ వద్ద ఆగడం మనం చూడవచ్చు.చాలా మోడర్న్, యూనిక్‌గా అది కనిపించింది.

మామూలు ఆటోరిక్షాలా ( Autorickshaw )కాకుండా ఇది భిన్నమైన షేప్, స్టైల్‌లో చాలా అట్రాక్టివ్ గా కనిపించింది.దీనిని చూసి ఇది చాలా అద్భుతంగా ఉందని, వావ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత సమయానికి సూపర్ పాపులర్ అయింది.ప్రజలు ఈ మూడు చక్రాల వాహనం గురించి మరింత తెలుసుకోవాలనుకున్నారు.దాని పేరు ఏంటి, ఎవరు తయారు చేసారు? అని ఒకరు అడిగారు.దీని గురించి తెలిసిన కొంతమంది సమాధానాలు చెప్పారు.

వారి ప్రకారం ఈ త్రీవీలర్‌ను లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ అని పిలుస్తారట.డెన్మార్క్‌కు చెందిన లింక్స్ కార్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

దీనికి రెండు సీట్లు ఉన్నాయి.అది టర్నింగ్ తీసుకున్నప్పుడు వంగి ఉంటుంది.దీన్ని భారతదేశానికి తీసుకురావడానికి రూ.31 లక్షలు ఎక్స్‌ట్రా డబ్బు ఖర్చు అవుతుంది.

Advertisement

తాజా వార్తలు