QR కోడ్‌ రంగుల్లో వుంది చూశారా?

QR code సిస్టమ్ గురించి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికీ తెలిసే వుంటుంది.

ముఖ్యంగా ఇపుడు పేమెంట్స్ అన్నీ QR codeని స్కాన్ చేయడం ద్వారానే ఫినిష్ చేస్తున్నారు.

కాబట్టి వీటిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అయితే దీనిని ముందుగా ఎవరు కనిపెట్టారో తెలుసా? Denso Wave అనే జపనీస్ కంపెనీలో వర్క్ చేసిన Masahiro Hara అనే ఇంజనీర్ కనిపెట్టడం జరిగింది. గో బోర్డ్ గేమ్ మీద ఉన్న నలుపు తెలుపు పీసెస్ నుంచి ఈ QR code డిజైన్ తీసుకున్నారు.

దెన్సో కంపెనీ తయారు చేసే ఆటోమొబైల్ పార్ట్స్ ట్రాక్ చేయటం కోసం ముందుగా ఈ QR కోడ్ కని పెట్టారు.

తరువాత ఆటోమొబైల్ పార్ట్ ని బాక్స్ లో పెట్టి ప్రతి బాక్స్ మీద Bar Codeని ఉంచారు.అలా ఇది వెలుగులోకి వచ్చింది.నేడు ఏదైనా బిల్ పే చెయ్యాలి అన్నా, Whatsapp laptopలో లాగిన్ అవ్వాలి అన్నా, కేఫ్ లో menu చూడాలి అన్నా ఈ గూగుల్ లెన్స్ ఆప్ లో QR కోడ్ ని స్కాన్ చేయాల్సిందే.

Advertisement

ఇపుడు దాదాపు చిన్న పెద్ద shops కూడా డిస్కౌంట్ కోసం QR కోడ్ స్కాన్ చెయ్యమంటున్నాయి.QR కోడ్ convience కి తగ్గట్టుగా వాడుతున్నారు.కొన్ని ఆప్స్, వెబ్సైట్, QR కోడ్ జెనరేట్ చేస్తున్నాయి కూడా.

ఈ దశలోనే జపాన్‌కు చెందిన ఇంజినీర్‌ మసహిరో హరా మరో కొత్త రకమైన క్యూఆర్‌ కోడ్‌ను అభివృద్ధి చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దాదాపు 30 ఏండ్ల క్రితం ఆయన తయారు చేసిన క్యూర్‌ కోడ్‌ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు.కొత్త క్యూఆర్‌ కోడ్‌ రంగుల్లో, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుందని మసహిరో హరా ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

అయితే ఇది అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు.ప్రస్తుతం ఉన్న క్యూఆర్‌ కోడ్‌ కంటే కొత్త దాంట్లో ఎక్కువ డాటా పట్టేలా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు