యూఎస్‌లో పబ్లిక్ టాయిలెట్ టెక్నాలజీ చూశారా..??

అమెరికా( America ) అంటేనే మోడర్న్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అని మనందరికీ తెలుసు కదా.

ఇప్పుడు అక్కడి ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ టాయిలెట్‌ హాట్ టాపిక్ గా మారింది.

ఆ టాయిలెట్ సెన్సార్ టెక్నాలజీని చూసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజలను ఆశ్చర్యపరుస్తోందివర్ష గౌర్( Varsha Gour ) అనే ఒక భారతీయ అమ్మాయి అమెరికా వెళ్లి రకరకాల విశేషాలను వీడియోలు తీసి భారతీయులకు చూపిస్తోంది ఇటీవల ఆమె అక్కడ ఓ బాత్రూమ్‌ యూజ్ చేసుకుంది.

అక్కడ తనకు కనిపించిన అద్భుతమైన సౌకర్యాలన్నీ వీడియో తీసి సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో, టాయిలెట్ సీట్‌పై ఆటోమేటిక్‌గా ప్లాస్టిక్ కవర్లు వేయబడుతున్న తీరుని చూపించింది.

ఒక బటన్‌ను తాకితే, పై నుంచి ఒక ప్లాస్టిక్ షీట్ వచ్చి మొత్తం సీట్‌ను కప్పేస్తుంది.

Advertisement

బాత్రూమ్‌లోకి వెళ్లిన వాళ్ళు సెన్సార్‌ని తాకితే చాలు, అంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని వర్ష చెప్పింది.ఈ విధంగా చేస్తే ఇన్ఫెక్షన్లు, జర్మ్స్ వ్యాప్తి అవ్వకుండా ఉంటాయట.అంతేకాదు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా, అన్ని పనులు ఒక్కసారిగా జరిగిపోయేలా ఈ ఆధునిక సదుపాయం ఉంది.

@Varshagour99 అకౌంట్ నుంచి ఈ వీడియోని షేర్ చేశారు.దీనికి 1674 మంది ఫాలోవర్లు ఉన్నారు.ఈ వీడియోని 17 లక్షల మంది చూశారు.

చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్‌ల రూపంలో పంచుకున్నారు.ఒకరు అమెరికాలో ఐదు సంవత్సరాలు ఉండగా ఇలాంటి బాత్రూమ్‌/టాయిలెట్‌ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

మరికొందరు అమెరికాలో ఇలాంటి బాత్రూమ్‌లు చాలా తక్కువ అని, చాలా బాత్రూమ్‌లు చాలా మురికిగా ఉంటాయని చెప్పారు.ఢిల్లీ( Delhi )లో కూడా ఇలాంటి సిస్టమ్ చూశానని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఆ సినిమాల విషయంలో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్న ప్రభాస్.. ఆలస్యమైతే ఇబ్బందేనా?
యూకే ఫ్యామిలీ వీసా : కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ సంచలన నిర్ణయం.. భారతీయులకు బిగ్ రిలీఫ్

ఈ చాలా స్మార్ట్‌గా ఉన్న ఈ టాయిలెట్‌పై మీరు ఒక లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు