రూట్ మార్చిన బి‌ఆర్‌ఎస్. ఆ భయంతోనే ?

గత కొన్నాళ్లుగా బి‌ఆర్‌ఎస్ పార్టీ( BRS party ) బిజెపిని కాదని కాంగ్రెస్( Congress ) ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తోంది.

ఆ మద్య అసలు కాంగ్రెస్ ను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం బిజెపిపైనే విమర్శలు చేసే బి‌ఆర్‌ఎస్‌.

ఇప్పుడు బిజెపిపై సైలెంట్ గా వ్యవహరిస్తూ అన్నీ అనార్థాలకు కాంగ్రెసే కారణం అనేలా వ్యవహరిస్తూ వస్తోంది.దీంతో బి‌ఆర్‌ఎస్ పార్టీ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గిందనే చర్చ తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడిచింది.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు భయపడే బిజెపి విషయంలో బి‌ఆర్‌ఎస్ నోరు మెదపడం లేదనే వాదన బలపడుతూ వచ్చింది.

కాంగ్రెస్ కూడా బి‌ఆర్‌ఎస్ మరియు బిజెపి పార్టీలు కుమ్మక్కు అయ్యాయని గట్టిగానే విమర్శిస్తోంది.దీంతో బి‌ఆర్‌ఎస్ పై తెలంగాణ ప్రజల్లో అవకాశవాద పార్టీ అనే ముద్ర కలిగేందుకు ఊతం ఇచ్చినట్లైంది.ఇక్కడే బి‌ఆర్‌ఎస్ పై ప్రజల్లో నెగిటివిటీ పెరుగుతోందని గ్రహించిన బి‌ఆర్‌ఎస్ అధిష్టానం.

Advertisement

వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాము ఏ పార్టీ తో పొత్తులో లేమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ ( Telangana IT Minister KTR )స్పష్టం చేశారు.

తమది ఏ టిమ్ బీ టిమ్ కాదని తమది ప్రజల టీం అంటూ చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్సీ కవిత విషయంలో బి‌ఆర్‌ఎస్ రాజీ పడే ప్రసక్తే తేల్చి చెప్పారు.తాము తప్పు చేసి ఉంటే ఏం చేసుకుంటారో చేసుకోండీ అంటూ సవాలు విసిరారు కే‌టి‌ఆర్.ఇలా బి‌ఆర్‌ఎస్ పొత్తుపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టె ప్రయత్నం చేశారు మంత్రి కే‌టి‌ఆర్.

తెలంగాణ ప్రజల్లో మొదటి నుంచి కూడా బి‌ఆర్‌ఎస్ పై మంచి అభిప్రాయమే ఉంది.ఆ మంచి అభిప్రాయం కారణంగానే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి రెండు సలు అధికారాన్నికట్టబెట్టారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం బి‌ఆర్‌ఎస్ కు కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో పొత్తుల అంశం బి‌ఆర్‌ఎస్ ను వెంటాడితే.

Advertisement

ఆ ప్రభావం ఓటు బ్యాంక్ పై గట్టిగానే పడే అవకాశం ఉంది.అందుకే రూట్ మార్చి ఏ పార్టీతోను బి‌ఆర్‌ఎస్ కు పొత్తు లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

తాజా వార్తలు