నాగ చైతన్య టైమ్ స్టార్ట్ అయిందా..? తండేల్ సక్సెస్ అవుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్యకు( Naga Chaitanya ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.

అక్కినేని నట వారసుడిగా వచ్చిన ఆయన ఇప్పుడు తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి( Telugu film industry ) సేవలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

ముఖ్యంగా ఆయన చేసిన జోష్ సినిమా( Josh movie ) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.కారణం ఏదైనా కూడా నాగచైతన్యకు నటుడిగా మంచి గుర్తింపైతే వచ్చింది.ఇక తర్వాత చేసిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత విజయాల పరంపర ను కొనసాగిస్తూ వచ్చారు.

ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరో రేంజ్ ను మాత్రం టచ్ చేయలేకపోయాడు.మరి ఇప్పుడు ఆయన మాస్ హీరోగా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మొదటి నుంచి కూడా మాస్ హీరోగా ఎదగడమే తన డ్రీమ్ అయినప్పటికీ మాస్ సినిమాలను పక్కన పెట్టి రొమాంటిక్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు.

Advertisement

మరి ఇప్పుడు అయితే మాస్ జపమే చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.ఇక తండేల్ సినిమాతో( Tandel ) భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయన మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా మార్కెట్ ను కూడా బిల్డ్ చేసుకున్న వాడు అవుతాడు.ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే మాత్రం ఆయన స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు