SSMB28 : ఫైనల్ గా.. మొదలెట్టిన షూట్.. ఇక ఆగేదేలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని ఖుషీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

సర్కారు సినిమా వచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లినా రెగ్యులర్ షూట్ జరగడం లేదు.మరి తాజాగా ఈ సినిమా రెగ్యురల్ షూట్ ఈ రోజు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

సెప్టెంబర్ 12న ఈ సినిమా హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వగా రేపటి విరామం లేకుండా షూటింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఫస్ట్ షెడ్యూల్ మహేష్ బాబు పైనే చిత్రీకరిస్తారట.

రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటికే భారీ సెట్ కూడా నిర్మించారట.బస్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ సన్నివేశాలను మంగళవారం నుండి దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరించ బోతున్నారని తెలుస్తుంది.

Advertisement

ఈ సినిమాకు ఈ సన్నివేశం హైలెట్ కానుందట.దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఎలాగైతేనేం అభిమానుల కోరిక తీరింది.త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు