అదంతా బిజెపి ప్లానే.. కే‌సి‌ఆర్ గమనించారా ?

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్( BRS ) మరియు బిజెపి( BJP ) మద్య ఉండే రాజకీయ పోరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

రాష్ట్రంలో ఒక పార్టీపై మరోటి పైచేయి సాధించడం కోసం ఇరు పార్టీల నేతలు వేసే వ్యూహాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి.

ఇక వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్( KCR ) ను గద్దె దించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.బి‌ఆర్‌ఎస్ ను దెబ్బతీసే ఏ చిన్న అవకాశాన్ని కూడా కమలం పార్టీ వదలడం లేదు.

గతంలో బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఈటెల రాజేందర్( Etela Rajender) ను ఆహ్వానించి కే‌సి‌ఆర్ పైకే ప్రధాన అస్త్రంగా వినియోగించుకుంటోంది కమలం పార్టీ.

ఇక ఈటెల కు చేరికల కమిటీ చైర్మెన్ పదవి అప్పగించి అతని ద్వారా బి‌ఆర్‌ఎస్ నేతలను బీజేపీలోకి లాక్కునే ప్రయత్నం చేసింది.అయితే ఆశించిన స్థాయిలో చేరికలు ఉండకపోవడంతో కొత్త వ్యూహాలకు పదును పెట్టారు కమలనాథులు.అందులో భాగంగానే బి‌ఆర్‌ఎస్ లోని అసంతృప్త నేతలను బీజేపీ కోవర్ట్ లుగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోందనే చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది.

Advertisement

బి‌ఆర్‌ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణ రావు( Ponguleti Srinivas Reddy, Jupalli Krishna Rao ) విషయంలో కమలనాథులు ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్లు వినికిడి.గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు కే‌సి‌ఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అంతే కాకుండా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బి‌ఆర్‌ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.ఇదిలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన అధిష్టానం.వారిద్దరిని సస్పెండ్ చేయక తప్పలేదు.

ఇప్పుడు వారిద్దరు బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ అయిందనే చర్చ జరుగుతోంది.త్వరలోనే వీరిద్దరు కమలం గూటికి చేరే అవకాశం ఉంది.

ఇక ఇలాగే బి‌ఆర్‌ఎస్ పై అసమ్మతిగా ఉన్న నేతలను కోవర్ట్ లుగా వినియోగించుకుంటూ కే‌సి‌ఆరే సస్పెండ్ చేసేలా బీజేపీ వ్యూహం రచించిందనే వాదన కూడా కొందరిలో ఉంది.ఇక చేయడం వల్ల అటు కే‌సి‌ఆర్ పై నెగిటివిటీ పెరగడంతో పాటు బీజేపీ బలం కూడా పెరుగుతుందనేది కమలనాథుల ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

మరి ప్రత్యర్థి వ్యూహాలను ముందుగానే పసిగట్టే కే‌సి‌ఆర్.ఈసారి కమలనాథుల వ్యూహాలను ఎలా ఎదృకొంటాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు