నాలుక మడతేసిన హరీష్ ? ఎదురుదాడి ముందే ఊహించారుగా 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ( BRS )తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు.మాజీ మంత్రి,  కేసీఆర్( KCR ) మేనల్లుడు హరీష్ రావు.

ముఖ్యంగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.పదే పదే కాంగ్రెస్ పైన , రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు .బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరిపోతుండడం,  ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరుతుండడం తో  కేడర్ ను కాపాడుకునేందుకు హరీష్ రావు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే విధంగా రుణమాఫీ పై హరీష్ రావు( Harish Rao ) సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

రుణమాఫీని గడువులోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.దీంతో రేవంత్ రెడ్డి చెప్పిన గడువు కంటే ముందుగానే రుణమాఫీ ఆమలు చేయడంతో హరీష్ రావు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు.

 హరీష్ రావు రాజీనామా పై కాంగ్రెస్ నేతలు ( Congress leaders )పూర్తిగా ఫోకస్ చేస్తారని, తన సవాల్ పై నిలదీస్తారని భావించిన హరీష్ ఈ విషయంలో కాంగ్రెస్ కంటే ముందుగానే అలర్ట్ అయ్యారు.ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి తాను కేవలం రుణమాఫీ గురించి మాత్రమే సవాల్ చేయలేదని, ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా హరీష్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) సమయంలో రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇవ్వడంతో,  రైతుల ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు రేవంత్ కు హరీష్ రావు అప్పట్లో సవాల్ చేశారు .

Advertisement

ఆగస్టు 15 లోపు రేవంత్ రెడ్డి రుణమాఫీని అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు సవాల్ చేశారు దీంతో అప్పుడే రాజీనామాకు సిద్ధంగా ఉంటా అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డి కి సవాల్ చేశారు.ఆ సవాలను స్వీకరించారు రేవంత్ రెడ్డి .నిన్నటి నుంచి తెలంగాణలో రుణమాఫీ మొదలు కావడంతో హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారనే దానిపైన అంత ఫోకస్ చేయడం,  విమర్శ దాడి మొదలు కావడంతో హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించి మరీ రాజీనామా పై క్లారిటీ ఇచ్చేశారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు