క్యాడర్ ను ఆపేందుకు హరీష్ రావు తంటాలు ! ఎన్నికల అస్త్రం పనిచేస్తుందా ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్( BRS ) నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ లోకి( Congress ) వలసలు జోరందుకున్నాయి.

వలసలను నివారించి , పార్టీ నాయకుల్లో భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అంతగా వర్కౌట్ కావడం లేదు.

  దీంతో పార్టీ నుంచి వలసలు పెరగకుండా నిరోధించే బాధ్యతను బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కు( Harish Rao ) అప్పగించినట్టు సమాచారం.  ప్రస్తుతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యే లతో పాటు , పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ లో  చేరుతుండడంతో,  బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. 

నాయకులు వెళ్లిపోయినా.కేడర్ ఉంటే  మళ్లీ బలం పెంచుకోవచ్చు అని,  క్యాడర్ కూడా వెళ్ళిపోతే పార్టీ అక్కడ బలహీనం అవుతుందని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావు ను రంగంలోకి దించింది.దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని కేడర్ కాంగ్రెస్ లోకి వెళ్లకుండా హరీష్ రావు రంగంలోకి దిగారు.

పార్టీ ఫిరాయింపులపై  సుప్రీంకోర్టును ( Supreme Court ) ఆశ్రయించామని,  కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా చేస్తామని,  ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని హరీష్ రావు చెబుతూ , పార్టీ కేడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు .ఇప్పుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినా పెద్దగా ప్రాధాన్యం దక్కదని క్యాడర్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

అయితే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా హరీష్ రావు క్యాడర్ కు చెబుతున్నా.  ఈ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు.  స్వీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది .కాకపోతే పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకు హరీష్ రావు ఈ విధంగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది .మరి కొద్ది రోజుల్లో టిఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్,  హరీష్ రావు,  కేసీఆర్ లు ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారకుండా చూసుకుంటూనే క్యాడర్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ డేరింగ్ స్టెప్ .. ఆ ఇబ్బందులన్నీ తొలిగినట్టే ?
Advertisement

తాజా వార్తలు