ఈ అస్తిత్వం.. వ్యక్తిత్వం మీరే నాన్నా... కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ పోస్ట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో దివంగత సీనియర్ హీరో నందమూరి తారక రామారావు( Nandamuri Tarakaramarao )  సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

అనంతరం తన వారసులని కూడా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేశారు.ఇలా ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ  ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

ఇక నటుడు హరికృష్ణ( Hari Krishna ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన తండ్రి రాజకీయాలలో ఎంతో సపోర్ట్ చేస్తూ ఉండేవారు.

ఇక నందమూరి హరికృష్ణ వారసులుగా కళ్యాణ్ రామ్( Kalyan Ram ) , జూనియర్ ఎన్టీఆర్( NTR ) ఇండస్ట్రీలో  స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇక ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందగా కళ్యాణ్ రామ్ మరోవైపు హీరోగాను అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.ఇకపోతే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఇదిలా ఉండగా నేడు హరికృష్ణ జయంతి కావడంతో తన కుమారులైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తన తండ్రి జయంతిని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ అస్తిత్వం మీరు.ఈ వ్యక్తిత్వం మీరు.మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్తానానికి నేతృత్వం మీరు.

ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో నటించిన దేవర ( Devara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకు నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు