బిగ్ బాస్ హౌస్ నుంచి హరితేజ ఎలిమినేట్.. ఆమె రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ 8 ( Bigg Boss Season 8 )నుంచి తాజాగా పదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా హరితేజ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

ఈమె కంటే ముందు బిగ్ బాస్ గంగవ్వ ( GanGavva )ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళింది.

మొదట గంగవ్వ ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం ఎలిమినేషన్ లేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కానీ ఇంతలోనే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు.

కాగా ముందు నుంచి అనుకున్నట్టుగానే పదవ వారం డబుల్ ఎలిమినేషన్ అందులో హరితేజ కూడా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

Hari Teja Eliminated Bigg Boss Telugu 8 Remuneration, Hari Teja, Bigg Boss Telug

అనారోగ్య కారణాలతో గంగవ్వ తనంతట తానే హౌస్‌ నుంచి బయటకు వెళ్లగా, ఆడియెన్స్‌ ఓట్ల కారణంగా హరితేజ( Hariteja ) ఎలిమినేట్ అయింది.స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన హరితేజ ప్రేక్షకుల అంచనాలకు తన ఆటతో రీచ్‌ కాలేకపోయింది.అక్టోబర్ 6న బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హరితేజ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement
Hari Teja Eliminated Bigg Boss Telugu 8 Remuneration, Hari Teja, Bigg Boss Telug

ఈ ఐదు వారాల్లో ఆమె సంపాదన ఎంత సంపాదించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే గతంలో అనగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన హరితేజ ఈ సీజన్‌లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Hari Teja Eliminated Bigg Boss Telugu 8 Remuneration, Hari Teja, Bigg Boss Telug

కానీ బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినప్పటికీ చెడ్డపేరు లేకుండానే హుందాగా ఆట నుంచి నిష్క్రమించింది.హౌస్‌ లో ఉన్నంతకాలం చలాకిగా కనిపించిన ఆమె ఆట తీరు బాగున్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో పెద్దగా ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ కాలేదని చెప్పవచ్చు.బహుషా ఈ కారణంతోనే ఆమె ఎలిమినేట్‌ అయ్యారని తెలుస్తోంది.కాగా సోషల్‌మీ డియాలో మంచి పాపులరాటీ ఉన్న హరితేజకు బిగ్‌ బాస్‌ ఒక వారానికి గాను రూ.3.5 లక్షల రెమ్యునరేషన్‌ ఇచ్చారని తెలుస్తోంది.అంటే రోజుకు రూ.50 వేల పారితోషకం ఆమె బిగ్‌బాస్‌ నుంచి అందుకుందని టాక్‌.బిగ్‌ బాస్‌లో అత్యధికంగా రెమ్యునరేషన్‌ అందుకునే వారి జాబితాలో హరితేజ ఒకరని చెప్పవచ్చు.బిగ్‌ బాస్‌లో తను ఐదు వారాలపాటు ఉన్నందుకు రూ.17 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు