ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్

ప్రస్తుతం బంగ్లాదేశ్( Bangladesh ) టీంతో టీమిండియా మూడు టి20 మ్యాచ్లను ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఈ క్రమంలో ఆదివారం నాడు గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఇండియన్ టీం ఏడు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడో.కేవలం బౌలింగ్ తోనే కాకుండా బ్యాటింగ్ లో కూడా విజృంభించాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం తరఫున అత్యంత పరుగులు తీసిన ఆటగాడిగా కూడా హార్దిక్ పాండే నిలవడం విశేషం.అయితే ఇన్నింగ్స్ లో భాగంగా హార్దిక్ పాండ్యా ఆడిన ఒక షాట్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

అది ఏమిటంటే.ఇన్నింగ్స్ లోని 12 ఓవర్ లో ఒక అద్భుతమైన షార్ట్ ఆడాడు హార్దిక్ పాండ్యా.

Advertisement

బంగ్లాదేశ్ టీం లో చాలా అనుభవము ఉన్న బౌలర్ తస్కిన్ అహ్మద్( Taskin Ahmed ) బాలు బౌన్సర్ గా వేయగా దాని హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్ చూపిస్తూ కదలకుండా నో లుక్ సిక్స్ టైప్ లో జస్ట్ అలా బ్యాట్ ను అడ్డంగా పెట్టాడు అంతే.అనంతరం ఆ బాలు ఎటువైపు వెళ్లిందనేది కూడా హార్దిక్ పాండ్య చూసుకోలేదు.చివరికి ఆ బాలు మెరుపు వేగంతో ఫోర్ వెళ్ళిపోయింది.

ప్రస్తుతం ఈ షాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.అలాగే ఈ సీజన్లో హార్దిక్ పాండ్య మంచి ఫామ్ లో ఉన్నట్లు అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియాలో విజయం వైపు తీసుకెళ్లనట్లు తెలుస్తుంది.

ఈ ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్యా కేవలం 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ చివర్లో హార్దిక్ సిక్సర్ తో మ్యాచ్ ముగిసి పోయింది.ఇలా సిక్సర్లతో మ్యాచ్ ముగించడం హార్దిక్ పాండ్యాకు ఇది ఐదవ సారి.

ఇలా హార్దిక్ పాండ్యా తప్ప మరి భారత క్రికెటర్ కూడా ఇన్ని సార్లు సిక్సర్లతో జట్టును విజయం వైపు తీసుకొని వెళ్లలేదు.ఇక ఈ మ్యాచ్ కు ఇండియన్ టీం కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వహించగా.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.అయితే బంగ్లాదేశ్ టీం కేవలం 19.4 ఓవర్లలోనే 127 పరుగులు తీసి ఆలౌట్ అవ్వగా.భారత్ తరుపున వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఇక టీమిండియా 128 పరుగుల లక్ష్య చేదనలో బ్యాటింగ్ స్టార్ట్ చేయగా 11.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.అనంతరం హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్( Suryakumar Yadav ) 29 పరుగులు తీసి ఇండియా టీమును విజయం వైపు తీసుకుని వెళ్లారు.

Advertisement

ఇక మిగతా రెండు మ్యాచ్ల విషయానికి వస్తే అక్టోబర్ 9న ఢిల్లీలోని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగబోతుండగా.మూడవ టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాదులోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగబోతోంది.

తాజా వార్తలు