ఆ ఎన్నారై అల్లుళ్ళపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం...!!!

ఎన్నారై ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పెళ్ళిళ్ళు చేసుకున్న ఎన్నారైలు ఎంచక్కా విదేశాలు చెక్కేసి అర్దాంగిని తమతో తీసుకువెళ్లకుండా, అలాగే భార్యలను తమతో తీసుకువెళ్ళి అక్కడ తమను అడిగేవాడు లేదని ఇష్టం వచ్చిన తీరిలో వ్యవహరిస్తూ భార్యలను చిత్ర హింసలు పెట్టే ఎన్నారైల తాట తీసేందుకు తెలంగాణా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

విదేశాలలో అబ్బాయి ఉంటున్నాడు, అక్కడ మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు అనగానే అమ్మాయిల తల్లితండ్రులు సహజంగానే అలాంటి మంచి సంభంధాలు కావాలని, అమ్మాయికి భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు.లక్షలు, కోట్ల కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు.

ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్న వారిలో కొందరు బాగానే జీవితాన్ని గడుపుతున్నా, మరికొందరి ఎన్నారై మొగుళ్ళు మాత్రం భార్యలను వేధింపులకు గురిచేస్తూ చిత్ర హింసలు పెడుతుంటారు.అమెరికా వెళ్ళిన తరువాత మన ఇష్టంలే అనుకుని, అక్కడ ఉంటే మనల్ని ఎవరూ ఏం చేయలేరని భావిస్తారు.

ఇలాంటి ఎన్నారై అల్లుళ్ళ పై కొరడా ఘులిపించడానికి తెలంగాణ పోలీసు శాఖ ఇప్పటికే కసరత్తులు చేస్తోంది.

Harassment Of Wives : Telangana Police To Cancel Nri Husbands Passport, Nri Husb
Advertisement
Harassment Of Wives : Telangana Police To Cancel NRI Husbands Passport, NRI Husb

తెలంగాణలో ఎన్నారై అల్లుళ్ళ గృహహింసా కేసులు లెక్కలేనన్ని పెరిగిపోవడంతో వారి పాస్ పోర్టుల రద్దుకై ప్రయత్నాలు మొదలు పెట్టారట.ముఖ్యంగా తమవద్ద నమోదయ్యే కేసుల్లో అధిక శాతం అమెరికాకు చెందిన ఎన్నారైల కేసులే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.ఈ క్రమంలోనే అమెరికా కాన్సులేట్ ను తాజాగా కలిసిన పోలీసు బృందం వారి సహకారం కోరగా కాన్సులేట్ కూడా అందుకు అంగీకారం తెలిపిందట.

అంతేకాదు ఇదే విషయంపై పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయ అధికారిని కూడా కలిసారని తెలుస్తోంది.ఇప్పటి వరకూ వేలాది ఎన్నారై ల గృహ హింసా కేసులు నమోదు కాగా వాటిలో కేవలం 15 మంది పాస్ పోర్టు లు రద్దు అయ్యాయని తాజాగా పోలీసు శాఖ తీసుకుంటున్న చొరవతో మరిన్ని కేసులు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నయాని అంటున్నారు పరిశీలకులు.

Advertisement

తాజా వార్తలు