హ్యాపీ బర్త్డే ధోని.. కెప్టెన్‌ లలో ‘ఎంఎస్ ధోనీ’ వేరయా..

2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెస్ ధోని( MS Dhoni )ని అప్పుడు భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవరు ఊహించలేకపోయారు.

ముఖ్యంగా టీమ్ ఇండియాకు వికెట్ కీపర్ కొరత తీవ్రంగా ఉన్న సమయంలో జులపాల జట్టుతో టీం లోకి వచ్చిన మహేందర్ సింగ్ ధోని తన పాత్రని పోషిస్తే చాలు అనుకున్నారు అప్పటి బిసిసిఐ కమిటీ సభ్యులు.

అయితే ఆ తర్వాత అందరికీ అర్థమైంది అంచలంచెలుగా ఎదుగుతూ.వికెట్ కీపింగ్ తో పాటు తన దూకుడైన ఆట శైలితో భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా.

అతి తక్కువ కాలంలోనే కెప్టెన్ గా మారిపోయాడు మహేంద్రడు.అనుకోకుండా వచ్చిన కెప్టెన్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా.

, టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ సారధిగా ధోని నిలిచాడు.నేడు ధోని తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనికే సాధ్యమైన కొన్ని రికార్డులను ఓ లుక్ వేద్దాం.

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికి సాధ్యం కానీ ఓ అరుదైన ఘనతను మహేంద్రసింగ్ ధోని తన తన పేరుపై లిఖించుకున్నాడు.కొత్తగా ప్రవేశపెట్టిన టి20 ప్రపంచ కప్( T20 World Cup ) ను 2007లో గెలవగా.ఆ తర్వాత మూడు దశాబ్దాలుగా ఎంతోమంది టీమ్ ఇండియాకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించిన వారికి సాధ్యం కానిది చివరికి మహేంద్రసింగ్ ధోని సారధ్యంలోని టీంకి 2011లో యావత్ భారతం గర్వించేలా ప్రపంచం కప్పును అందుకున్నాడు.

ఆ తర్వాత మరోసారి ప్రపంచంలోని జట్టులతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ( Champions Trophy )ని 2013లో భారత్ కు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.ఇలా ఐసీసీ నిర్వహించిన టైటిల్ లన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని చరిత్ర ఎక్కాడు.

ఇప్పటికి క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచులకు కెప్టెన్ గా వహించిన వ్యక్తిగా ఎమ్మెస్ ధోని ఉన్నాడు.మొత్తం మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్లకు మహేంద్రసింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించాడు.60 టెస్టులలో కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక వికెట్ కీపర్ కూడా ధోనినే.అంతేకాదు టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా ధోనిని రికార్డు సాధించాడు.332 మ్యాచులలో కెప్టెన్ గా సేవలందించిన ధోని 178 విజయాలను అందుకున్నాడు.ఇక భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారధ్యం వహించిన కెప్టెన్గా ధోని పేరు ఉంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

వికెట్ కీపర్ జాబితాలో కూడా ధోనిదే వ్యక్తిగత అత్యధిక స్కోర్.శ్రీలంకపై 2005లో 183 పరుగులు చేశాడు.

Advertisement

ఆపై అత్యధిక స్టంపౌట్స్ చేసిన రికార్డు కూడా ధోని పేరిటనే ఉంది.ధోని మూడు ఫార్మేట్ లలో కలిపి ఏకంగా 538 మ్యాచ్లలో 195 స్టంపౌట్స్ చేశాడు.మొత్తంగా అన్ని ఫార్మేట్లో కలిపి 829 అవుట్ లలో పాలుపంచుకున్నాడు.

అందుకే మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ బెస్ట్ ఫినిషర్, ప్రపంచ బెస్ట్ వికెట్ కీపర్, ప్రపంచ బెస్ట్ కెప్టెన్ గా ఇలా అనేక పేర్లను సంపాదించుకున్నాడు.

తాజా వార్తలు