ఉడుత రూపంలో హనుమంతుడు.. ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఇదే..!

రామాయణంలో ప్రముఖ పాత్ర హనుమంతుడిదేనని కచ్చితంగా చెప్పవచ్చు.చిరంజీవిగా కలియుగంలో పూజలను అందుకునే హనుమంతుడికి మన దేశంలో గూడి లేని గ్రామం లేదు.

అలాగే విగ్రహం లేని గ్రామం కూడా కచ్చితంగా లేదు అని చెప్పవచ్చు.ఆంజనేయుడు, భజరంగబలి, మారుతి, అంజనీ పుత్రుడు, హనుమంతుడు వంటి అనేక పేర్లతో పూజలను అందుకుంటున్న హనుమంతుడికి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.

హనుమంతుడు నిలుచున్న, కూర్చున్న ఏ భంగిమలో ఉన్న, వానర రూపంలో ఉన్న, విగ్రహాన్ని చూసి ఉంటారు.అయితే హనుమంతుడు( Hanuman ) ఉడత రూపంలో పూజలను అందుకుంటున్నా దేవాలయం ఒకటి ఉందని చాలామందికి తెలియదు.

అయితే అలీఘర్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో హనుమంతుడు ఉడత( Squirrel ) రూపంలో ఉంటాడు.ఈ దేవాలయమును సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు.

Advertisement
Hanuman In The Form Of A Squirrel.. This Is The Only Temple In The World..! , Ha

ఇప్పుడు హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాం.భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందిన అలీఘర్‌( Aligarh )లోని అచల్ సరోవర్ ఒడ్డున హనుమంతుడి దేవాలయం ఉంది./br>

Hanuman In The Form Of A Squirrel.. This Is The Only Temple In The World.. , Ha

వాస్తవానికి ఇక్కడ విగ్రహం ఉన్నదనే విషయాన్ని సాధువు గిల్హారాజ్ శ్రీ మహేంద్రనాథ్ యోగి జీ మహారాజ్ గుర్తించారు.ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.అంటే ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెబుతున్నారు.

శ్రీ మహేంద్ర నాథ్ యోగి జి మహారాజ్ కలలో ఒకసారి హనుమంతుడు కనిపించాడని కూడా చెబుతున్నారు.ఈ కలలో యోగి ఉడత రూపంలో ఉన్న హనుమంతుడిని పూజించాడు./br>

Hanuman In The Form Of A Squirrel.. This Is The Only Temple In The World.. , Ha

ఆ తర్వాత ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు.ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఉడుతా హనుమాన్ దేవాలయం అని భక్తులు నమ్ముతారు.వాస్తవానికి ఎక్కడైనా సరే హనుమంతుడి పూజిస్తే ఆ భక్తుల కష్టాలు తొలగి హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అయితే ఈ ఉడత హనుమాన్ దేవాలయం కాస్త ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు.ఈ దేవాలయంలో 41 రోజులపాటు పూజలు చేసిన వారి అన్నీ కష్టాలు దూరమైపోతాయని చెబుతున్నారు.

Advertisement

ఈ దేవాలయంలో ప్రతిరోజు చాలామంది భక్తులు బజరంగబలికి రకరకాల పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.

తాజా వార్తలు