సీక్వెల్‌ చేయాలనే ఉంది కానీ, సాధ్యం కాదంటున్న దర్శకుడు

దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా రూపొందిన సీతారామం సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను కూడా మెప్పించింది.

అందుకే ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమా యొక్క సీక్వెల్ కోరుకుంటున్నారు.హీరో దుల్కర్ ని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులు ప్రశ్నించగా సీక్వెల్ అయితే ఉంటుందేమో కానీ అందులో నేను ఉండక పోవచ్చు అన్నాడు.

అంతే కాకుండా అలాంటి సినిమా ని మళ్లీ మళ్లీ చూడాలనుకోవడంలో తప్పులేదు కనుక సీక్వెల్ ఉంటే బాగుంటుంది అన్నట్లుగా కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.తాజాగా దర్శకుడు హను రాఘవపూడి కూడా స్పందించాడు.సీతారామం సినిమా సీక్వెల్ గురించి ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

హీరో చనిపోయిన తర్వాత సీక్వెల్ కి కథ రెడీ చేయడం ఎలా సాధ్యమవుతుందని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు.అయితే అలాంటి మరో మంచి ఫీల్ గుడ్ మూవీ తీయాలని కోరుకుంటున్నాట్లుగా మాత్రం హను రాఘవపూడి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Advertisement

తన తదుపరి సినిమా విషయం లో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అతి త్వరలోనే అధికారికంగా తన తదుపరి సినిమా ను ప్రకటిస్తాను అంటూ దర్శకుడు పేర్కొన్నాడు.ఇక హీరో గా దుల్కర్ సల్మాన్ మలయాళం సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా బిజీ బిజీ గా నటిస్తున్నాడు.మరో సారి దుల్కర్‌ తెలుగు సినిమా లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రస్తుతానికి మాత్రం దుల్కర్‌ సల్మాన్ తెలుగు సినిమా లపై ఆసక్తి చూపడం లేదు.తెలుగు కథలు వినేందుకు టైమ్‌ ఇవ్వడం లేదు.

వచ్చే ఏడాది లో అయినా దుల్కర్‌ తెలుగు సినిమా వస్తుందేమో చూడాలి.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు