ఆ టిప్స్ పాటించి సులువుగానే బరువు తగ్గాను.. హన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక(hansika) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ (Junior NTR ,Allu Arjun)లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.2007లో దేశముదురు(Desamuduru) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత 2011లో ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రంలో హీరోయిన్ గా నటించి కోలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది.

ఈ చిత్రం సక్సెస్‌ అవడంతో హన్సికకు వరుసగా అవకాశాలు ఎక్కువగా క్యూ కట్టాయి.

అలా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ(Telugu, Tamil, Kannada, Hindi) భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాదు బొద్దుగా ఉండడంతో మొదట్లో కోలీవుడ్‌ లో చిన్న కుష్బూ అనే ముద్రను కూడా వేసుకుంది.కాగా పలు భాషల్లో హీరోయిన్ గా నటించి 50 చిత్రాల మైలురాయి అధిగమించిన హన్సిక (Hansika)ఆ మధ్య పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.అయితే ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోవడం లేదు.వాణిజ్య ప్రకటనల్లో నటించడం, టీవీ షోలకు అతిథిగా పాల్గొనడం అంటూ బిజీగానే ఉంటూ, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌ గా ఉంటోంది.

Advertisement

ఇదివరకటి రోజుల్లో బొద్దుగా ఉన్న హన్సిక ఈ మధ్యకాలంలో కాస్త లావు తగ్గే స్లిమ్ గా తయారయింది.అయితే తాజాగా ఆమె అలా స్లిమ్ గా అవ్వడానికి గల కారణాలను వెల్లడించింది.మంచి నీళ్లను ఎక్కువగా తాగుతాను.

యోగా ధ్యానం వంటి శారీరక కసరత్తులు చేస్తాను.క్యాలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినను.

ఈ టిప్స్ అన్ని కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా నాకు సహాయపడ్డాయి అని చెప్పుకొచ్చింది హన్సిక.ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన టిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం హన్సిక ఢీ షో వంటి షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఢీ షో తో ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు